జనరంజక పాలన అంటే ఇదేనా.. జగన్?  

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికున్న మానసిక సమస్య.. ప్రజల పాలిట, ఉద్యోగుల పాలిట శాపంగా మారింది.

ఏపీలో గతంలో ఎన్నడూ చూడని విచిత్ర.., సంక్లిష్ట పరిస్ధితులను ఈ నాలుగునరేళ్ళల్లో ప్రజలు చూస్తున్నారు. నవరత్నాలు పేరిట జరిగిన ధనహోమం.. రాష్ట్రాన్ని అన్నీ విధాలుగా అప్పులు పాలు చేసింది. అభివృద్ధి అంతా కుంటుపడి రెండు దశాబ్ధాల వెనక్కిపోయేలా చేసింది. పరిశ్రమలు లేవు.., వ్యాపారాలు దయనీయం. ఉపాధి లేదు.. ఉద్యోగ అవకాశాలు అంతకన్నా లేవు. మొత్తంగా ఏపీ చరిత్రలో ఎన్నడూ ఎదుర్కొని ఒక సంకట స్థితిని చవిచూస్తోంది. ఈ నేపధ్యంలో  ప్రజా అభిప్రాయాలు.., చట్టాలు.., న్యాయస్థానాలతో పనిలేకుండా తనకు నచ్చిందే చేసుకుంటూపోయే ముఖ్యమంత్రి చర్యలు ప్రజల పాలిట శాపాలుగా మారాయి.

కోర్టు ఆదేశాలు బేకాతరు చేస్తూ.., చట్టాలను తుంగలో తొక్కే జగన్ రెడ్డి ప్రభుత్వం నిత్యం రాష్ట్రంలో ఏదోఒక వైలేషన్ క్రియేట్ చేస్తూనే ఉంటది. ప్రజా రాజధానిని కూల్చడంతో ప్రారంభమైన ఏపీ పతనం.. రుషికొండను బోడిగుండు చేసిన వైనం వరకు ఎన్నో సర్వనాశనాలను.., ప్రభుత్వ ఒంటెద్దుపోకడలను ప్రజలు కళ్ళరా చూశారు. మూడు రాజధానులు పేరిట జగన్ చేస్తున్న నీచ రాజకీయం ఆ పార్టీ మొత్తాన్ని సర్వం చంకనాకించిందని విశ్లేషణలు ఈ నాటివి కావు.

ఇప్పుడు పరిపాలన రాజధానిని విశాఖ కేంద్రంగా నిర్వహించాలని జగన్ చేస్తున్న ఆలోచనలు.. ఆ పార్టీకి బెడిసికొడుతోంది. జగన్ క్యాంపు కార్యాలయం విశాఖ రుషికొండపై నిర్మాణాలు చేస్తుంటే.. మరోవైపు శాఖాధిపతుల కార్యాలయాలు కూడా అక్కడే నిర్మాణం అవుతున్నాయి. రుషికొండ ను బోడిగుండ చేసి దాదాపు 500 కోట్లుతో సీఎం క్యాంపు కార్యాలయం నిర్మించారు. దీనికి టూరిజం కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చారు. కానీ .. ఇది అక్రమ నిర్మాణమని హై కోర్టు గుర్తించింది. అనుమతికి మించి తవ్వకాలు జరిపారని, అన్ని నిర్మాణాలు నిబంధనలకు విరుద్దంగా నిర్మించారని హైకోర్టు నియమించిన కమిటీ పరిశీలించి నివేదిక అందజేసింది.

దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ఏపీ హై కోర్టు ఆదేశించింది. అక్రమ నిర్మాణాలయితే కూల్చివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. సీఆర్ జెడ్ నిబంధనలు ఉల్లంఘించి మరీ నిర్మాణాలు చేశారన్నది విచారణలో తెలింది. ఇది అత్యంత ఘోరమైన పర్యావరణ ఉల్లంఘన అని త్వరలో ఈ ఘాతుకానికి పాల్పడిన ప్రభుత్వాధికారులందరూ తగిన మూల్యం చెల్లించుకో తప్పదని హెచ్చరికలు సైతం ఉన్నాయి. ఇటువంటి అక్రమ నిర్మాణల్లోకి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఎలా వెళ్తారని వాదనలు వినవస్తున్నాయి.