ప్రపంచ కప్ భారత్ శుభారంభం..!యువ క్రికెటర్లకు స్ఫూర్తి..!

నిన్న రాత్రి జరిగిన ఫ్రపంచ కప్ 2023 లో భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపోందింది.

తొలుత  బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాపై భారత్ బౌలర్లు నిప్పులు చేరిగారు. 199 రన్స్ కే ఆల్ ఆవుట్ చేసి.. 200 పరుగుల స్కోర్ ఛేదనకు బరిలో దిగిన భారత్ కు ఆదిలోని ఎదరు దెబ్బతగిలింది. 2 పరుగులకే కెప్టెన్ రోహిత్ శర్మ సహా.. మూడు కీలక వికెట్లు కోల్పోయింది. సురేష్ అయ్యర్.., ఇషాన్ కిషన్ లు నిరాస పరిచినా..జట్టుకు విరాట్ కోహ్లీ.., రాహుల్ వెన్నుదండుగా నిలబడ్డారు. స్కోర్ బోర్టును నెమ్మది కదిలిస్తూ.. వికెట్ పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

యువ క్రికెటర్లుకు ఎంతో స్పూర్తినెచ్చిలే ఇరువురు అద్భుత బ్యాటింగ్ చేసి జట్టు స్కోర్ ను 165 పరుగు భాగస్వామ్యం నెలకొల్పారు. 85 పరుగుల వద్ద విరాట్ క్యాచ్ తో పెవిలియన్ చేరగా.. రాహుల్ కు హార్థిక్ జతకట్టారు. 97 పరుగులతో ఆజేయంగా నిలిచిన రాహుల్ ఇంకా 9 ఓవర్లు మిగిలి ఉండగానే భారత్ కు ఘన విజయాన్ని అందించారు. ఫీల్డింగ్.., బ్యాటింగ్ లో ఎంతో పటిష్టంగా ఆస్ట్రేలియాను స్వల్పస్కోర్ వద్ద కట్టడి చేయడం.., ఓవర్స్ మిగిలే ఉండగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం వంటివి ప్రపంచ కప్ లో మ్యాచ్ ల్లో ఇది హైలెట్ గా చెప్పవచ్చు.