క్రికెటర్లు ఇంటా కాకర్స్ మోత..!

కలర్ ఫుల్ దీపావళి పర్వదిన వేడుకలను భారత క్రికెట్ టీం కుటుంబ సభ్యులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. వేడుకల ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

దీపావళి అంటేనే కలర్ ఫుల్.., జాయ్ ఫుల్ .., ఎంజాయ్ ఫుల్ గా ఉంటుంది. ఆ వేడుకలను కుటుంబ సభ్యులతో నిర్వహించుకున్న ఇండియా క్రికెట్ టీం సభ్యులు సోషల్ మీడియాలో వాటిని పంచుకున్నారు. సింగిల్ గా కొందరూ.., ఫ్యామిలీతో మరికొందరూ దీపావళి వేడుకలు జరుపుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి ఇప్పడు వైరల్ గా మారాయి.

రోహిత్ శర్మ తన భార్యతో కలిసి .. దీపావళి శుభాకాంక్షలు తెలపగా.. ఇషాన్ కిషన్, శుభమ్ గిల్, అశ్వీన్, ఫాస్ట్ బౌలర్లు షమి, బుమ్రా, మహమ్మద్ సిరాజ్ లు వెరైటీ గా కలర్ ఫుల్ వస్త్రధారణలో రెడీ అయ్యీ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.