వేడెక్కిన రాజకీయం.. జగన్ ప్లాన్ – బి అప్లై..!

రాష్ట్రం రాజకీయాలతో అట్టుడికుతున్న వేళ.. వాటిని పెద్దగా పట్టించుకోకుండా ఎంతో స్థిత ప్రజ్ఞతతో ముందుకు అడుగులు వేయడన్నది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికే సాధ్యం.

స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం రాష్ట్రం వార్ జోన్ లోకి వెళ్లింది. అప్పుడు లండన్ పర్యటనలో ఉన్న జగన్.. దానిపై ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. వచ్చిన తరువాత కూడా ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టికానీ.. తన సోషల్ మీడియా ఖాతాలో కనీసం స్పందించలేదు. కానీ మంత్రులు.., ఎమ్మెల్యేలు.., సలహాదారులు మాత్రం చంద్రబాబు అతిపెద్ద అవినీతి చేశాడంటూ  ఒక రేంజ్ లో రెచ్చిపోయారు. నేటికీ రెచ్చిపోతూనే ఉన్నారు. బాబు అరెస్ట్ ఈ ఆదివారంతో 29 రోజులు గడిచింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రాబాబు.. ఎప్పుడు బయటకు వస్తాడో తెలియని పరిస్థితి.

ఈ నేపథ్యంలో ఈ నెల 5,6 నెలల్లో జగన్  ఢిల్లీ టూర్ పొలిటికల్ హీట్ ను రాజేసింది. అందరూ అనుకున్నట్లు నిధులు..,పెండింగ్ బిల్స్ ప్రతులను కేంద్ర మంత్రులకు ఇచ్చి వచ్చారనుకున్నారు. మరికొందేమో తన పాత కేసుల నుంచి తనను విముక్తి చేయాలని విన్నవించి తిరిగి వచ్చారని విశ్లేషించారు. కానీ.., అక్కడే అందరూ లెక్క తప్పారు. ప్లాన్ – ఏ ప్రకారం జనరల్ గా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్-2024 లో ఎన్నికలు జరగాలి. ఏప్రిల్ లో ఎన్నికలంటే మార్చి నెలలో జగన్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసి.. ఎన్నికల బరిలో ఉండాలి. అందుకు గాను మార్చి నెలను తీసేస్తే ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికలకు వెళ్తే.. నష్ట తప్పదని జగన్ కు  సర్వేలు సూచిస్తున్నాయి.

ఎందుకంటే.., ప్రస్తుతం ఏపీలో బాబు అరెస్ట్.. జనసేన పొత్తుతో అధికార వైసీపీ డిఫెన్స్ లో పడింది. అది సమయం గడిచేకొద్ది.. ప్రభుత్వం వ్యతిరేక ఓటు బ్యాంకు ఇంకా పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్న జగన్ .. ప్లాన్ – బీ అమలకు సన్నగ్థం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇది అమలు చేస్తే కచ్చితంగా ప్రభుత్వాన్ని ఫాం చేసేంత సీట్లు తప్పనిసరిగా వస్తాయన్నది ఆ పార్టీ అంచన. ఒకవైపు బాబు జైల్లో ఉన్నారు. జనసేన పార్టీ ఇంకా పూర్తిస్థాయితో ఏపీలో నిర్మాణం కాలేదు. నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ మినహాయిస్తే ఎక్కడ ఆ పార్టీకి కేడర్ లేదు. ఓటు బ్యాంక్ అయితే ఉంది కానీ.., పటిష్టమైన కేడర్ లేదు. కేడర్ కోసం ఆ పార్టీ శరవేగంగా తనదైన కార్యక్రమాలతో ప్రజల్లోకి తీసుకెళ్తుంది.

మరోవైపు ఏపీలో 26 లక్షల దొంగ ఓట్లను వైసీపీ అనుకూల వర్గం నియోజకవర్గాల వారీగా చేర్పించి ఉంది అన్నది విపక్షాల ఆరోపణ. అది నిజమైతే.. బాబు అరెస్ట్ తో టీడీపీ.., అసంపూర్ణంగా నిర్మాణంలో ఉన్న జనసేన ను ఎదుర్కొవడం జగన్ కు చిన్నపని.  ఈ క్రమంలో ముందుస్తుకు వెళ్తే జగన్ కు ఇవన్నీ కలిసొచ్చే అంశాలు. అందుకే ఢిల్లీపోయిన జగన్ 5 రాష్ట్రాల ఎన్నికలతోపాటు వెళ్లాలన్న ఆలోచనను చెప్పి వచ్చారని.., అందుకు తగ్గ గ్రౌండ్ ప్రిపరేషన్ ఇప్పటికే సిద్ధం చేసుకుని ఉన్నామని కేంద్రంతో చెప్పారని సమాచారం.

ప్లాన్ బీ తో ముందస్తుకు అంతా సిద్ధం అన్న సంకేతాన్ని ఇప్పటికీ వైసీపీ సోషల్ మీడియాలో నిన్న రాత్రి నుంచే రన్ అవుతోంది. టీడీపీ కూడా అందుకు తగ్గట్లు అన్ని రకాల సన్నహాలు చేసుకుంటుంది. జైలు నుంచి చంద్రబాబు కేడర్ కు దిశా నిర్థేశం చేస్తున్నారు. ఏదీఏమైన రాజకీయాల్లో ఏదీ జరిగినా.. పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదన్నది జగమెరిగిన సత్యమేగా.