ఏపీ ముందస్తుకు..సర్వసిద్ధం..!

ఏపీలో ముందస్తుకు అధికారపార్టీ ఉవ్విలూరుతోంది. అందుకు తగ్గ గ్రౌండ్ ను కూడా సిద్ధం చేసుకుంటుంది.  

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు చేసిన తర్వాత అధికారపార్టీ యాక్టీవ్ మోడ్ లోకి వచ్చింది. ఇదే అదునుగా జగన్ గేమ్ ఆప్లైకు అధిష్టానం రంగం సిద్ధం చేసింది. ఈ నేపధ్యంలోనే విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం  వేదిక జగన్ కొత్త వ్యూహ రచన వర్కౌట్ అవుతోందని నేతలు అంచనాలేస్తున్నారు. సార్వత్రిక సమరభేరి పేరిట  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం లో  నిర్వహించిన సభకు  దాదాపు 8,266 మంది ప్రజా ప్రతినిధులు.. పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

వైసిపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జిలు, ఉపాధ్యక్షులు, కుల వృత్తుల కార్పోరేషన్ చైర్మన్లు, గృహ సారధులు, సర్పంచ్ లు,ప్రభుత్వ సలహాదారులు, తదితరులు హాజరుకానున్నారు. అక్రమ కేసులో చంద్రబాబు నాయుడు ఇరికించి.. ఎన్నికలకు పోవాలనే ఉద్దేశంతో  ఈ సమావేశం నిర్వహిస్తున్నారని   తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది.

ఈ సభలో వైసీపీ ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను వివరించేలా ప్రజల్లోకి వెళ్లాలి. గత ప్రభుత్వంలో అందిచిన ప్రతి సంక్షేమ పథకంలో టీడీపీ చేసిన అవినీతిని  ఎలా వివరించి ముందుకు పోవాలి అన్న కోణంలో కార్యక్రమానికి హాజరైన శ్రేణులకు జగన్ నిర్దేశం చేయనున్నారు. అలానే తెలుగుదేశం పార్టీలో  లోకేష్ తోపాటు  ఇతర మాజీ మంత్రులు  పథకాల పేరిట ఎటువంటి అవినీతికి పాల్పడ్డారు చెప్పాలంటూ నిర్దేశం చేయనున్నారు.