జగన్ అవినీతిపై జనసేన శంఖారావం..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రభుత్వ అవినీతిని ఎండగట్టేలా జనసేన సమర శంఖారావం పూరించింది.

ఏపీలో అమలు అవుతున్న ప్రతి స్కిమ్.., స్కామేనని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. జగన్ అవినీతిని ఎండగట్టేలా ప్రతి రోజు మీడియాకు వివరించే కార్యక్రమానికి ఆయన తెరతీశారు. నాడు నేడు పేరుతో విద్యాశాఖలో జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చి సంస్కరణలు అవినీతి మరకలు అద్దుకుందని జనసేన ఆరోపిస్తోంది. జగనన్న విద్యా కానుక పేరుతో భారీ దోపిడి జరిగిందని మనోహర్ సాక్ష్యాలతో సహా వాదిస్తున్నారు. విద్యా కానుక పథకం లో ప్రాథమిక అంచనా మేరకు రూ. 120 కోట్ల స్కామ్ చేశారని రుజువులను చూపుతోంది జనసేన. టెండర్లలో 5 కంపెనీలు మాత్రమే ఎప్పుడూ పాల్గొనేవని.., అవి కూడా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ చెందిన కంపెనీలని వివరిస్తున్నారు.  నాలుగేళ్ళ పాలనలో దాదాపు రూ. 2,400 కోట్ల టెండర్లును  ఈ ఐదు కంపెనీలు ఉన్నాయి.

జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీలో భారీ కుంభకోణం: జనసేన పీఏసీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్, nadendla-manohar-on-ysrcp-government-corruption

ఈ కంపెనీలపై ఈడీలు దాడి చేయగా దాదాపు రూ. 120 కోట్లు దారి మళ్లించినట్లు గుర్తించారు. 42 లక్షల మంది విద్యార్ధుల కోసం ఆర్డర్లు ఇచ్చారని.., అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యార్ధుల సంఖ్య 35 లక్షల మంది మాత్రమే. అయితే మిగిలిన ఆర్డర్లు ఎవరికోసం పెట్టినట్లు అని మనోహర్ ప్రశ్నించారు. అయితే నాడు-నేడు పథకానికి బడ్జెట్ లో చూపించిన నిధుల్లో రూపాయి కూడా కేటాయించలేదు అని మనోహర్ ఆరోపించారు.