బ్రాహ్మణులకు నా క్షమాపణలు.. జూపూడి వేడుకోలు..!

బ్రాహ్మణులను అత్యంత నీచంగా పోల్చి..వారిని హోరంగా అవమానించిన జూపూడి ప్రభాకర్ ను వదిలిపెట్టమని, దాడులకు సైతం తెగబడతామని బ్రాహ్మణ సంఘాలు హెచ్చరిస్తున్నారు.

బ్రాహ్మణులను దళితులు కాళ్ళు పట్టుకునే స్ధితికి జగన్ రెడ్డికి తీసుకొచ్చారని అత్యుత్సహంతో వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బ్రాహ్మణ సంఘాల ఆగ్రహావేశాలకు దారి తీశాయి.  వైసీపీ చేపట్టిన సామాజీక బస్సు యాత్రలో జూపూడి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ సంఘాలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న బ్రాహ్మణులు జూపూడిపై గర్జించారు. హద్దుమీరి మాట్లాడితే.. భౌతిక దాడులకు సైతం దిగుతామని హెచ్చరించారు.

నెల్లూరు జిల్లా కావలి బస్సు యాత్ర సందర్భంగా జూపూడి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జగన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాల వలన బ్రాహ్మణులు  దళితుల బూట్ల కొలతలు తీసుకునే స్థాయికి వచ్చారని జూపూడి వ్యాఖ్యల్లో సారాంశం. ఇదే వ్యాఖ్య బ్రాహ్మణులను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశారు. బ్రాహ్మణులు ఆగ్రహావేశాలు చివరికి వైసీపీలోని బ్రాహ్మణ నాయకులకు సైతం చుట్టుకుంది. బ్రాహ్మణులను ఇంతలా అవమానించే పార్టీలలో బ్రాహ్మణులుగా పుట్టి ఎలా కొనసాగుతున్నారని నిలదీశారు.

 దీంతో గత్యంతరం లేక జూపూడి ప్రభాకర్ బ్రాహ్మణులకు క్షమపణలు చెప్పారు. జగన్ అందిస్తున్న సంక్షేమాన్ని వివరించే క్రమంలో తాను  చేసిన వ్యాఖ్యలు బ్రాహ్మణులను బాధిస్తే క్షమించాలని కోరారు. ఇలా వ్యాఖ్యలు చేయడం ఎందుకు..? క్షమాపణలు చెప్పడం ఎందుకు..? అని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. కులాల మధ్య చిచ్చుపెట్టేలా చేసిన జూపూడి చేసిన వ్యాఖ్యలే రాజకీయంగా హాట్ టాపిక్ మారింది.