కాంతితో క్రాంతి గ్రాండ్ సక్సెస్..!

తెలుగుదేశం పార్టీ అధినేతనారా చంద్రబాబు నాయుడు  అరెస్టుతో  రెండు తెలుగు రాష్ట్రాలు  రాజకీయంగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తో తెలుగుదేశం పార్టీ నెలరోజులుగా వినూత్న కార్యక్రమాలకు పిలుపునిస్తోంది.  ఈ నేపథ్యంలో  తెలుగుదేశం పార్టీ ఆ మొన్న మోత మోగిద్దాం.., సత్యమేవ జయతే కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో తెలుగు దేశం పార్టీకి  రెండు తెలుగు రాష్ట్రాల్లో అనూహ్య స్పందన వచ్చింది. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని చంద్రబాబుకు మద్దతు తెలిపి  సంఘీభావం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని శనివారం పిలుపునిచ్చారు.  సాయంత్రం 7 గంటల నుంచి 7.05 నిమిషాల వరకు అంటే ఐదు నిమిషాల వరకు సెల్ ఫోన్ లైట్లను,  దీపాలను వెలిగించి  చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసించాలని కోరారు. దీంతో లోకేష్ పిలుపు అందుకున్న ప్రజలు,  కార్యకర్తలు పెద్ద ఎత్తున  ఈ కార్యక్రమంలో భాగస్వామిలయ్యారు.

 శనివారం సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు  ఇంటి బయట వాకిట్లో తమ మొబైల్ లైట్స్, దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి  నిరసన వ్యక్తం చేశారు. రోడ్లపై ఉన్న వారు వాహనాల  లైట్లను బ్లింక్ చేస్తూ సంఘీభావం వ్యక్తం చేశారు. నారా భువనేశ్వరి రాజమండ్రిలో  మహిళా కార్యకర్తలు సమక్షంలో దీపాలు వెలిగించి  చంద్రబాబుకు సంఘీభావం తెలుపగా.. నారా లోకేష్ ఢిల్లీలో దీపం వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. లోకేష్ కార్యక్రమంలో ఎంపీలు గల జయదేవ్.., రఘురామ పాల్గొని దీపాలు వెలిగించారు.

 మరో వైపు ఏసీ ఎన్టీఆర్ భవన్ వద్ద  అచ్చెంనాయుడు, టిడిపి నేతలు  దీపాలు వెలిగించి నిరసన వ్యక్తం చేయగా.. హైదరాబాద్, బెంగుళూరు తదితర ప్రాంతాల పెద్ద సంఖ్యలో దీపాలు వెలిగించి చంద్రబాబు పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.