బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల..గతం కన్నా రెట్టింపు సంక్షేమం..!

బీఆర్ఎస్ అధినేత.., ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ లో మీడియా సమక్షంలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు.

బీఆర్ఎస్ పార్టీని మరోసారి గెలిపిస్తే గతం కన్నా రెట్టింపు ఉత్సాహంతో ప్రజా సేవా చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే సంక్షేమ పధకాల పెద్దపీఠ వేస్తానని చెప్పారు. ఆదివారం ప్రగతి భవన్ లో ఆయన ప్రకటించిన మేనిఫెస్టో లో గతం కన్నా రెట్టింపు సంక్షేమాన్ని అమలు చేసేలా హామీలు ప్రకటిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మేనిఫేస్టోలో ప్రధానంగా చూసుకుంటే రైతు, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రైతు బంధు, దళిత బంధును కొనసాగిస్తూనే రైతు బంధును 16 వేలు చేస్తామన్నారు. అలానే అసరా పెన్షన్ ఏడాదికి 500 పెంపు, సౌభాగ్యలక్ష్మి పథకం పేరిట అర్హులైన మహిళలకు నెలకు రూ. 1000 భృతి, దివ్యాంగులకు పెన్షన్లు రూ.4,016 నుంచి 6 వేలకు పెంచుతూ హామి ఇచ్చారు.

తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ.., రూ. 5 లక్షల ఉచిత భీమ సౌకర్యం కల్పిస్తున్నట్లు హామీ ఇచ్చారు. అలానే గిరిజనులకు పోడు భూమి పట్టాలు, అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్ట్ లకు  రూ. 400 లకే గ్యాస్ సిలిండర్ వంటివి అందిస్తామని హామీ ఇచ్చారు. ఇలా అనేక హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచి.. పెద్దఎత్తున బడుగు బలహీన, అనగారిన వర్గాలకు కేసీఆర్ పెద్దపీఠ వేశారని బీఆర్ఎస్ నేతలు ప్రశంసించారు.

ఇదిలా ఉంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను కాపీ కొట్టి మేనిఫెస్టోలో హామీలు ప్రకటిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హామీలను, ఆయన పార్టీని ప్రజలు నమ్మె పరిస్ధితి లేదని ఎద్దేవా చేశారు.