కాజల్ హీరోయిన్ గా ‘సత్యభామ’..!

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న ‘సత్యభామ’ చిత్రానికి సంబంధించిన టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

కాజల్ అగర్వాలు ఇప్పటికే ‘భగవంత్ కేసరి’ హిట్ తో ఫుల్ జోష్ లో ఉండగా.. కాజల్ లీడ్ రోల్ ‘సత్యభామ’ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ చితంలో కాజల్ పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. ఈ చిత్రానికి తక్కలపల్లి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు.

మేజర్ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క ఈ సినిమాను ప్రజెంట్ చేస్తున్నాడు. స్ర్కిన్ ప్లే బాధ్యతలు కూడా ఆయనే చూస్తున్నారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీపావళి పర్వదినం సందర్భంగా సత్యభామక సినిమా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.