వ్యవస్థలను మేనేజ్ చేయడం అంటే ఇదేనేమో. ఏకంగా ఎన్నికల సంఘాన్ని సైతం తప్పదోవ పట్టించి..ఏపీ వ్యాప్తంగా లక్షల్లో ఓట్లు తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నాలుగునరేళ్ళు వైసీపీ పాలనలో ప్రజలకు నరకాన్ని చవిచూస్తున్నారు. రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేక పొట్ట చేతపట్టుకుని బడుగు జీవులు పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళారు. ఇదే అదునుగా వీరిలో టీడీపీ, న్యూట్రల్ ఓట్లుగా ఎవరున్నారని ఆరా తీసి వాటిని టార్గెట్ చేసి.. జాబితా నుంచి తొలగించారు. అది వేలల్లో కాదు.. లక్షల్లో తొలగించారు.  ఇలా రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ జగన్ రెడ్డి లాంటి వాళ్ళు హరిస్తుంటే పీడిత వర్గాలు బ్రతులకు దుర్భరం కాదా..? ఇటువంటి పరిస్ధితి నుంచి ఉద్యమాలు, స్వాతంత్ర్య సమరాలు పుట్టవా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏపీలో ఇటువంటి పరిస్ధితులకు ప్రత్యక్షంగా పోలీసులు, అధికారులు, రాష్ట్ర ఎన్నికల సంఘమే అని సాక్ష్యాలను సైతం సేకరించి నిలదీస్తున్నారు.  గడిచిన పదినెలలో దాదాపు 13 లక్షల 48 వేల ఓట్లు తొలగించబడ్డాయి. వీటిలో 5 లక్షల 78 వేల ఓట్లు వలసదారులవే కావడం గమనార్హం.

అసలు ఫాం-7 ద్వారా పెద్దఎత్తున ఓట్లను తొలగించాలని విజ్ఞప్తులు వస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తున్నట్లు. దారినిపోయే వాడు సైతం ఫలాన వారి ఓట్లు తొలగించాలని ఫాం -7 ఇస్తే తొలగించడమేనా..? కనీసం విచారణ.., సంబంధిత కుటుంబ సభ్యులకు నోటోసులు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా ఎలా ఓట్లు తొలగిస్తారు..? అంటూ పెద్దఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.  ఇలాంటి పోకడలకు పోతే.. రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినదా..? అంటూ బాధిత వర్గం ఆరోపిస్తోంది.

స్వంతత్ర సంస్థగా ఉన్న ఎన్నికల సంఘం.. నేడు నీచ రాజకీయ చదరంగంలో అబాసుపాలౌతోంది. రాజ్యాంగ సంస్థల్లో అత్యున్నత స్ధానం కలిగిన భారత ఎన్నికల సంఘం దేశ రాష్ట్రపతిని సైతం ఎంపిక చేసే అధికారం ఉంది. అటువంటి సంస్ధ కేవలం అధికార పార్టీకోసం పనిచేయడం.. విపక్ష పార్టీలపై ఇలా వివక్ష చూపడం ఎందుకు..? అని సామాన్యులు సైతం సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. రాజ్యాంగ సంస్థపై ఇటువంటి మరకలు అద్దుతుంటే విచక్షణాధికారం ఉన్నాలేనట్లేగా..? అన్న ప్రశ్నలు తలెత్తక మానడం లేదు.