ఉచితంగా 25 లక్షల భీమా.. బంపర్ ఆఫర్..!

ఎన్నికల సమీపిస్తున్న వేళ.. రాజకీయ పార్టీల హామీలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు గుప్పిస్తున్నారు.

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారాలో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లును ఆకర్షించే పథకాలు తీసుకొస్తున్నామంటూ ఊరిస్తూ.. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల్లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో బీజీబీజీగా గడుపుతుండగా.., కొన్ని పార్టీలు అభ్యర్ధుల ఎంపిక విషయంలో తర్జనభర్జన పడుతున్నాయి.

ఇవన్నీ ఒకవైపైయితే రాజకీయ పార్టీల మేనిఫెస్టో గెలుపుకు కీలక పాత్ర వహించనున్నది. ఈ నేపధ్యంలో  కేసీఆర్ మేనిఫెస్టో ను విడుదల చేయగా.. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ను ఆ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ విడుదల చేశారు. మహిళలకు ఉజ్వల భవిష్యత్తునిచ్చే పథకాలను అందిస్తామని హామీ ఇస్తూనే.. రూ.25 లక్షల ఆరోగ్య భీమా అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ప్రతీ కుటుంబానికి వర్తించేలా ఉచితంగా ఆరోగ్య భీమా అందజేస్తున్నట్లు మేనిఫెస్టోలో పొందుపరిచారు. అలానే గ్యాస్ సిలెండర్ రూ.500 లకు, రూ.2 లక్షల రుణమాఫి, పంటకు మద్దతు ధర వంటివి కమల్ నాథ్ విడుదల చేసిన మేనిఫెస్టోలోని మరికొన్ని హైలెట్స్ గా నిలుస్తున్నాయి.