గట్టు దాటుతున్న నేతలు..! షాక్ లో పార్టీలు..!

తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన నాటి నుంచి అధికార బీఆర్ఎస్ తోపాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలో కూడా సీట్ల సద్దుబాటు ఛాలెంజ్ గా మారింది.

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అందరి కన్నా నేను ముందు అంటూ ఎన్నికల షెడ్యూల్ రాకముందు 115 నియోజకవర్గాల్లో అభ్యుర్ధులను ప్రకటించారు. మొత్తం 119 అసెంబ్లీలకు గానూ.., 115 ప్రకటించి.. వేర్వేరు కారణాలతో 5 నియోజకవర్గాలను అలా పెండింగ్ లో పెట్టారు. దాదాపు 90శాతం సిట్టింగ్ లకే కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పోయిన ఆదివారం తెలంగాణ భవన్ లో ఆ పార్టీ తరుఫున బరిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్ధులకు, ఇతర నేతలకు బీ ఫామ్ లను అందజేశారు కేసీఆర్. ముందుగా ప్రకటించిన దాదాపు 115 మందితోపాటు మిగతా ఆశావాహులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ ఎవరు ఊహించని విధంగా కేవలం లక్కీ ఫిగర్ ను బేస్ చేసుకుని ముందుగా 51 మందికి బీ ఫామ్స్ ఇచ్చి సాగనంపారు.ఆ తరువాత కొన్ని ఇచ్చారు. మొత్తంగా ఇప్పటికీ 108 మంది అభ్యర్ధులు బీఫామ్స్ ను అందుకున్నారు. అయితే బీపామ్స్ తీసుకోని 11 మంది అభ్యర్ధులు గుండెల్లో బాకు దించిన మాదిరిగా మదనపడుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు గాంధీ భవన్ కాంగ్రెస్ అభ్యర్ధుల్లో కూడా ఇదే పరిస్ధితి నెలకొంది. తొలి జాబితా 55 మంది అభ్యర్థులను ప్రకటించారు. మిగతావి పరిశీలనలో ఉన్నాయని చెబుతున్నారు. వాటిని త్వరలో ప్రకటిస్తామని.., ముందు గెలుపు కోసం కావాల్సిన వ్యూహాలను సిద్దం చేసుకోవాలని ఆశావాహులకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ సూచిస్తున్నారు. ఇంకోవైపు బీజేపీ ఇంకా అభ్యర్ధుల జాబితాను ప్రకటించలేదు. ఎప్పుడు ప్రకటిస్తారో కూడా క్లారిటీ లేదు.

ఈనేపధ్యంలో బీఆర్ఎస్ లో నిరసనల సెగలు భగ్గుమంటున్నాయి. బీపామ్స్ అందుకున్న అభ్యర్ధుల మినహా.. సిట్టింగ్ స్థానాల్లో ఉన్న అభ్యర్ధుల్లో టెన్షన్ నెలకొంది. సీటును డిక్లేర్ చేసి కూడా.. బీఫామ్స్ ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అల్లంపూర్, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి, ఎంఐఎం సిట్టింగ్ స్థానాల్లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఇదే ఉత్కంఠ బీఆర్ఎస్ నేతలు, సిట్టింగ్స్ లో నెలకొంది. మొత్తంగా బీఆర్ఎస్ 11 మంది.., కాంగ్రెస్ 60 అభ్యర్ధుల్లో కొంత ఆందోళన నెలకొంది. వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో నేటికీ ఎన్నికల సన్నాహాలు ఇంకా ప్రారంభకాలేదు.

ఈ క్రమంలో ఎక్కడ చూసిన సాధారణ వాతావరణం నెలకొంది. గ్రూప్ సమావేశాలు నిర్వహించుకుంటూ మొక్కుబడిగా మమ అనిపించుకుంటున్నారు. ప్రజల్లోకి ప్రచారం బాట ఇంకా పట్టలేదు. అభ్యర్దుల ప్రకటన.., బీ ఫామ్స్ వచ్చిన తరువాత మిగతా విషయాలు అని ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ చూస్తున్నట్లు తెలుస్తోంది.