అవనిగడ్డలో రౌడీ ఎమ్మెల్యే.. నడి వీధిలో వీరంగం..!

ఉమ్మడి కృష్ణాజిల్లా అవనిగడ్డలో రౌడీ ఎమ్మెల్యే నడి వీధులో వీరంగం సృష్టించారు. తెలుగు రాష్ట్రాలలో ఈ షో కొత్త రికార్డును క్రియేట్ చేసింది.

వైసీపీకి 2019 జనం మొచ్చి.. ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఆ ఒక్క ఛాన్స్ తుఫానులో.. విజయం తెలియని వాళ్ళు.., ప్రతి సారి ఓటమి చవిచూసే వాళ్ళు సైతం గెలుపు గుర్రాలు ఎక్కారు. ఆ కోవకు చెందిన వాడే అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. 2009 ప్రజారాజ్యం, 2014 వైసీపీ నుంచి అవనిగడ్డలో ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి టైం ఆయేగా అన్న దాంట్లో రమేష్ ఎమ్మెల్యేగా గెలిచేశారు.

మరి ఎమ్మెల్యే స్థాయిలో అది.. రెండు దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఇప్పుడేందుకు అలా వీధిల్లో పడి రౌడీలా రెచ్చిపోతున్నాడు..? అరిపోయే దీపం మాదిగా ఉన్న వైసీపీ ప్రభుత్వ కాలం.. చివరాఖరుకు వచ్చిన తర్వాత కూడా తన సొంత భావోద్వేగాలను పార్టీపై, పదవిపై రమేష్ ఎందుకు  రుద్దుతున్నారు..? అన్న విమర్శలు స్థానికంగా వెల్లువెత్తున్నాయి.

గత ఏడాది ముఖ్యమంత్రి జగన్ అవనిగడ్డ పర్యటించినప్పుడు ఆ ప్రాంతంలో పలు సమస్యలపై వరాలు గుప్పించారు. కర కట్టల అభివృద్ధి, కోడూరు రహదారి అభివృద్ధి, అవనిగడ్డలో డంపింగ్ యార్డ్ నిర్మాణం, పాత ఎడ్లంక వద్ద వంతెన నిర్మాణం కోసం 93 కోట్లు కేటాయింపు వంటి హామీలిచ్చారు. వీటిని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ..టీడీపీ, జనసేన నేతలు స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. దీంతో కోపం కట్టలు తెంచుకుని వీధీ రౌడీ మాదిరిగా మారారు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. చేతికి కర్ర.. కంటికి ఎర్ర తెచ్చుకుని మరి విజృంభించారు. దొరికిన వారిని దొరికినట్లు బాదేశాడు. ఈ దాడిలో జనసేన వీర మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. పదుల సంఖ్యలో టీడీపీ, జనసేన నేతలకు గాయాలయ్యాయి. ముఖ్యమంత్రి స్ధాయి వ్యక్తి ఇచ్చిన హాలు నెరవేర్చాలని అడిగితే.. ఎమ్మెల్యే తన స్థాయి మరిచి.. కర్రలతో మాపై స్వయంగా దాడికి దిగుతారా..? అని ప్రశ్నించారు. అలా ప్రశ్నించిన టీడీపీ, జనసేన నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు.. కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి మండలాల్లోని పోలీసు స్టేషన్లకు తిప్పి.. రాత్రికి వదిలేశారు.

ఇది జగన్ మోహన్ రెడ్డి ఇలకాలలో వైసీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యకాండ అని సోషల్ మీడియాలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. విమర్శలు, నిరసనలు.., ధర్నాలు.., రాస్తారోకో లు సమాజంలో కామనే. వాటికి విలువియ్యకపోయిన పర్వలేదు.. నిలువరించే ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే భవిష్యత్తులో రాజకీయ జీవితానికి   పాతరేసుకోవడమే. వచ్చే ఎన్నికల్లో ఓడి.. వైసీపీ ప్రతిపక్షంలో ఉంటే.. ఎలా రోడ్డుపైకి వస్తారు.. మిస్టర్ ఎమ్మెల్యే అండ్ కో అంటూ..? నిలదీస్తున్నారు. మాకు జరిగింది మేం ఎలా మర్చిపోతాం..ఇంతకు పదింతలు బదులు తీర్చుకుంటాం.. అంటూ టీడీపీ, జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.