సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం.. ఇక జగన్ జైలుకేనా..?

సుప్రీం కోర్టు సంచలన తీర్పును శుక్రవారం వెలువడించింది. దీంతో వచ్చే ఏడాది జనవరిలోనే జగన్ జైలుకు పోవడం ఖాయమని విశ్లేషణలు ఊపందుకున్నాయి.

జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ మే 28, 2012 లో సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసలు విచారణ హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో విచారిస్తోంది. అయితే జగన్ 16 నెలలు జైలు జీవితం అనుభవించిన తరువాత సెప్టెంబరు 24, 2013న షరతులతో కూడిన బెయిల్ ను సీబీఐ కోర్టు మంజూరు చేసింది. ఆనాటి నుంచి ఈ రోజు వరకు దశాబ్ధకాలంగా జగన్ రెడ్డి అదే బెయిల్ పై బయటున్నాడు. 2014 ఎన్నికల్లో ఓటమి అనంతరం.., 2019లో వచ్చిన ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి.., వైసీపీని అధికారంలో తెచ్చారు జగన్. ఈ నేపధ్యంలో జగన్ రెడ్డి సీబీఐ కోర్టును, సీబీఐ అధికారులను మేనేజ్ చేస్తూ.. బెయిల్ పై దర్జాగా తిరుగుతున్నారని.., ఆయనకు చట్టాలు వర్తించవా.. ? అంటూ నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.

ఇప్పుడే ఇదే దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. గడిచిన పదేళ్ళలుగా జగన్ రెడ్డి కేసును విచారించకుండా వాయిదాలపై వాయిదా వేస్తోందిని.., హైదరాబాద్ సీబీఐ కోర్టును, సీబీఐ అధికారుల తీరును తప్పుబడుతూ సుప్రీంలో కేసుల బదిలీ పిటిషన్ వేశారు రఘురామ. ఇప్పటికీ 3,041 సార్లు సీబీఐ కోర్టు జగన్ కేసులను వాయిదాలు వేసిందని.. ఇది  దేశ చరిత్రలో ఏఒక్క నేరస్తుడికి ఇన్ని అవకాశాలు ఇవ్వలేదని పిటిషన్ లో రఘురామ చెప్పుకొచ్చారు. ఈ కేసు తెలంగాణలో ఉన్న సీబీఐ కోర్టు కాకుండా పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంను కోరారు.

దీంతో విచారణ చేపట్టిన సుప్రీం జస్టిస్ ఖన్నా, జస్టిస్ భట్టి తో కూడిన ధర్మాససం జగన్ రెడ్డి, సీబీఐ అధికారులకు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణ అలస్యంతోపాటు.. వేల సంఖ్యలో వాయిదాలు కోరగానే ఇవ్వడంపై ప్రశ్నించింది. దీనిపై వచ్చే ఏడాది జనవరిలో సమాధానమివ్వాలని ఆదేశించింది సుప్రీం. దీంతో పిటిషన్ పై విచారణను జనవరికి వాయిదా వేసింది.

ఎంపీ రఘురామ బదిలీ పిటిషన్ తో జగన్ అక్రమాస్తుల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. మరోవైపు చంద్రబాబుపై నమోదు అవుతున్న కేసులతో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి హోదాలో ఆయనేంత మంచి చేశాడో ప్రజలకు అర్ధమౌతుంటే.., జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి .. ఎన్ని కేసుల్లో నిందుతుడిగా ఉన్నారు…? అసలు ఆయనపై ఎందుకు అన్నీ కేసులు ఉన్నాయి…? వేల కోట్లు ఎలా దోచుకున్నారు..? అన్న విషయాలు మరోసారి తెరపైకి వస్తున్నాయని విశ్లేషణలు వినవస్తున్నాయి.