mutton keem samosa, టేస్టీ టేస్టీ మటన్ కీమా సమోసా.. – how to make mutton keema samosa know here process all in telugu

0


How to make: టేస్టీ టేస్టీ మటన్ కీమా సమోసా..

Step 1:

బాండీలో నూనె తీసుకుని స్టవ్ మీద వేడి చేయాలి. దీనికి 2 టీ స్పూన్‌ల వెల్లుల్లి పేస్ట్, 1 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్, కొంచెం కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ గరంమసాలా పౌడర్, 2 టీ స్పూన్‌లు తరిగిన పచ్చిమిరపకాయలు వేసి మొత్తం కలిసేలా ఫ్రై చేసుకోవాలి.

క‌ర‌క‌ర‌లాడే మ‌ట‌న్ కీమా స‌మోసా


Step 2:

ఇప్పుడు వీటికి 250 గ్రాముల మటన్ కీమా యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ పదార్థాలను మీడియం సెగ మీద 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అనంతరం తరిగిన ఉల్లిపాయలు వేసి ఇంగ్రిడెంట్స్ అన్ని కలుపుకోవాలి.

STEP1

Step 3:

ఇప్పుడు వీటికి 1/2 కప్పు తరిగిన కొత్తిమీరను వేసి కలుపుకోవాలి. ఇంగ్రిడెంట్స్‌లోని నీళ్లంతా ఆవిరి అయ్యేంత వరకు 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అనంతరం స్టవ్ కట్టేసి ఈ మిశ్రమాన్ని చల్లార్చనివ్వాలి.

step3

Step 4:

సమోసా పట్టీలను కోన్ ఆకారంలో కట్ చేసుకోవాలి. ఇందులో మటన్ కీమా మిశ్రమాన్ని పెట్టి క్లోజ్ చేయాలి. మైదా కలిపిన నీటిని ఉపయోగిస్తూ చేతితో తడి చేసుకుంటూ సమోసా షేప్ వచ్చేంత వరకు ముద్దగా చేయాలి.

step5

Step 5:

ఇప్పుడు బాండీలో నూనె తీసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత సమోసాలను వేసి గోధుమరంగు వర్ణం వచ్చేంత వరకు వేయించుకుంటే.. వేడివేడి మటన్ కీమా సమోసాలు రెడీ. వీటిని మీకు ఇష్టమైన ఏదైనా చట్నీ లేదా సాస్‌తో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

step7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *