నేటి నుంచి భువనేశ్వరి ‘నిజం గెలవాలి’..!

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి నేటి నుంచి ‘నిజం గెలవాలి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో గత 47 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి.. అరెస్ట్  చేశారని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 150 మందికి పైగా మనస్తాపానికి గురై.. గుండె ఆగి చనిపోయారు. ఇలా చనిపోయిన కుటుంబాలకు భరోసా కల్పించేందుకు నారా భువనేశ్వరి తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో మూడు రోజులు పర్యటించనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మృతుల కుటంబాలు పరామర్శిస్తారు. అనంతరం సాయంత్రం స్థానిక మహిళలతో భేటీకానున్నారు.

రాష్ట్రంలో అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాలను.., మహిళలకు వివరిస్తూ.. బాధిత కుటుంబాలను పరామర్శించుకుంటూ భువనేశ్వరి ముందుకు సాగుతుంటే.. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని చంద్రబాబు తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. రాయసీమలో ఆగిపోయిన ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించేందకు అన్నీవిధాలుగా ఏర్పాట్లును పార్టీ అధిష్టానం పరిశిలిస్తోంది. త్వరలో ఆ కార్యక్రమాన్ని లోకేష్ ప్రారంభిస్తారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు రాగానే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో యువగళం యాత్ర కూడా ప్రారంభం అవుతోందని లోకేష్ ఇప్పటికే ప్రకటించారు.  ఎక్కడైతే యువగళం ఆగిపోయిందో అక్కడి నుంచే ఆ యాత్ర ప్రారంభించేలా పార్టీ అదిష్టానం ఏర్పాట్లు చేస్తోంది.

మరోవైపు టీడీపీ జనసేన తో కలిసి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించేందుకు సన్నద్ధమౌతోంది. ఇరు పార్టీల ఉమ్మడి కార్యాచరణకు సంబంధించిన ప్రణాళిను ఇప్పటికే సిద్ధమైంది. సరైన రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకుని ఇరుపార్టీలు శ్రేణులు ముందుకు వెళ్లేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది.