స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఏపీలో రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత.., మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టై .. నేటికి 34 రోజులు కావస్తుంది. ఈ కేసుతో పాటు మరో ఇన్నరింగ్ రోడ్డు ఎలైన్మెంట్, పైబర్ గ్రిడ్ వంటి కేసుల్లో కూడా చంద్రంబాబును చేర్చుతూ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పిటిషన్ ను వేసింది సీబీఐ. ఈ తరుణంలో ఇన్నరింగ్ రోడ్డు ఎలైన్మెంట్ కేసులో ఆరోపణలు ఎదర్కొంటున్న లోకేష్  రెండు రోజు తాడేపల్లి సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరైయ్యారు. విచారణ అనంతరం లోకేష్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ పొద్దుపోయాకా కేంద్ర హోం శాఖ మంత్రిఅమిత్ షా ను కలిశారు. ఇది ఎవరు ఊహించని పరిణామం.

అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వడం.. లోకేష్ తోపాటు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి.., తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కూడా ఈ భేటీకి వెళ్లడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. ఈ ఒక్క భేటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రాజకీయ చర్చకే దారితీస్తోంది. ఇప్పటి వరకు కేంద్రం డైరెక్షన్లలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారన్న వాదనకు ఈ భేటీ అనేక ప్రశ్నలకు తావిస్తోంది. తెలంగాణలో 119 స్ధానాల్లో తెలుగు దేశం పోటీ చేయబోతోంది అన్న 15 రోజులుకే చంద్రబాబును అరెస్ట్ చేశారు.. అందుకేనా..? అది కేసీఆర్ గెలుపుకేనా..?.., అంటే అవుననే సమాధానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఏపీలో ఒకవైపు లోకేష్ యువగళం పాదయాత్ర.., మరోవైపు చంద్రబాబు వరుస రాయలసీమ పర్యటన వంటి వాటితో తెలుగు దేశం బలంగా ప్రజల్లోకి వెళ్తుంది. ఈనేపధ్యంలో చంద్రబాబు అరెస్ట్ తెలుగుదేశం అన్ని కార్యక్రమాలకు బ్రేక్ పడింది. మొన్న లోకేష్ సీఐడీ విచారణ ముగిసిన తరువాత అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కాకుండా సంబంధంలేని ప్రశ్నలు అడుగుతున్నారని.., కేవలం నా పాదయాత్రను ఆపేందుకే కుట్రతో కేసులు పెడుతున్నారని మీడియాకు చెప్పారు. తెలుగు దేశం బలపడితే దెబ్బ జగన్ మోహన్ రెడ్డికేగా..? మరి జగన్ ఎవరి కనుసన్నల్లో పనిచేస్తున్నారో తెలియని కాదు. ఒక వైపు కేసీఆర్.., మరో వైపు కేంద్రం డైరెక్షన్ లోనే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని ఇప్పటికే తెలుగు దేశం ఆరోపించడం చూస్తునే ఉన్నాం. అయితే ఈ భేటీలో పురంధేశ్వరి, కిషన్ రెడ్డి కూడా హాజరుకావడం అనేక సందేహాలకు సమాధానాలుగా కనిపిస్తోంది.

అమిత్ షా, లోకేష్ భేటీలో చంద్రబాబు ను అక్రమ అరెస్ట్, ఆ తరువాత పెట్టి కేసులు గురించి వివరించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్ధితి అంత బాగోలేదని అమీత్ షా దృష్టికి లోకేష్ తీసుకురాగా.. దానిపై ఆయన ఆరా దీశారు. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ బంతి కేంద్రం కాలుకింద ఉందన్నది సో ….. క్లియర్.