nithyamenen, ఆరేళ్ల పాటు వేధింపుల‌కు గుర‌య్యా.. నిత్యామీన‌న్ సెన్సేష‌నల్‌ కామెంట్స్‌ – heroine nithya menen shocking comments on santosh varkey

34
1659860583_pic.jpg

[ad_1]

సినీ ఇండస్ట్రీలో మ‌హిళ‌లు చాలా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటారు. వాటిని చాలా మంది బ‌య‌ట‌కు పెట్టరు. ఎందుకంటే.. జ‌రుగుతున్న ప‌నిని వ‌దిలేసుకుని వివాదాల చుట్టూ తిర‌గటం ఎవ‌రికీ ఇష్టం ఉండ‌దు క‌దా అందుక‌ని. కానీ మీ టూ ఉద్య‌మం జ‌రిగిన స‌మ‌యంలో ఇలాంటి లైంగిక వేధింపులు స‌హా మ‌హిళ‌లు త‌మ‌కు ఎదురైన ప‌లు స‌మ‌స్య‌ల‌ను ఏక‌రువు పెట్టారు. అందులో చిన్నా చిత‌కా జూనియ‌ర్ ఆర్టిస్టులే కాదండోయ్‌. స్టార్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడా లిస్టులో త్యామీన‌న్ (Nithya Menon) కూడా చేరారు.

 

Nithya Menon
నిత్యా మీనన్
సినిమా ఇండ‌స్ట్రీ బ‌య‌ట చూడ‌టానికి చాలా అందంగా క‌నిపిస్తుంది. కానీ అందులోనూ స‌మ‌స్య‌లు ఉంటాయి. ముఖ్యంగా మ‌హిళ‌లు చాలా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటారు. వాటిని చాలా మంది బ‌య‌ట‌కు పెట్టరు. ఎందుకంటే.. జ‌రుగుతున్న ప‌నిని వ‌దిలేసుకుని వివాదాల చుట్టూ తిర‌గటం ఎవ‌రికీ ఇష్టం ఉండ‌దు క‌దా అందుక‌ని. కానీ మీ టూ ఉద్య‌మం జ‌రిగిన స‌మ‌యంలో ఇలాంటి లైంగిక వేధింపులు స‌హా మ‌హిళ‌లు త‌మ‌కు ఎదురైన ప‌లు స‌మ‌స్య‌ల‌ను ఏక‌రువు పెట్టారు. అందులో చిన్నా చిత‌కా జూనియ‌ర్ ఆర్టిస్టులే కాదండోయ్‌. స్టార్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడా లిస్టులో విల‌క్ష‌ణ పాత్ర‌లతో ద‌క్షిణాదిన త‌నకంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నిత్యామీన‌న్ (Nithya Menon) కూడా చేరారు.

నిజంగా నిత్యామీన‌న్ తాను వేధింపుల‌కు గుర‌య్యాన‌ని చెప్పటం ఓ రకంగా అంద‌రినీ షాక్‌కి గురి చేసింది. అస‌లు నిత్యామీన‌న్‌ని ఎవ‌రూ వేధించారు. ఎందుకు? అనే వివ‌రాల్లోకి వెళితే.. రీసెంట్‌గా ఓ సంద‌ర్భంలో నిత్యామీన‌న్ త‌న‌కు సినీ ఇండ‌స్ట్రీలో ఎదురైన ఇబ్బంది గురించి చెప్పుకొచ్చింది. సంతోష్ వ‌ర్గీస్ (Santosh Varkey) అనే వ్య‌క్తి త‌న‌ను పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్రచారం చేసుకున్నాడని, ఆరేళ్ల పాటు త‌న‌ను సంతోష్ అన్‌పాపుల‌ర్ చేశాడ‌ని నిత్యామీన‌న్ పేర్కొంది. ఈ విష‌యంలో త‌న‌ త‌ల్లిదండ్రులు త‌న‌కు అండ‌గా నిల‌బ‌డ్డార‌ని, అత‌న్ని గ్ట‌టిగా హెచ్చ‌రించామ‌ని ఆమె తెలియ‌జేసింది. త‌న సంతోష్‌ను పెళ్లి చేసుకుంటాన‌ని వ‌చ్చిన వార్త‌ల్లో నిజం లేద‌ని నిత్యామీన‌న్ చెప్పింది.

ప్ర‌స్తుతం ధ‌నుష్ (Dhanush) హీరోగా న‌టించిన తిరుచిత్రాంబ‌లం (Thiruchitrambalam)లో నిత్యామీన‌న్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రం ఆగ‌స్ట్ 18న రిలీజ్ అవుతుంది. హీరోయిన్‌గానే కాకుండా నిత్యామీన‌న్ ఈ మ‌ధ్య కాలంలో నిర్మాత‌గానూ మారింది.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Web Title : Telugu News from Samayam Telugu, TIL Network

[ad_2]

34 thoughts on “nithyamenen, ఆరేళ్ల పాటు వేధింపుల‌కు గుర‌య్యా.. నిత్యామీన‌న్ సెన్సేష‌నల్‌ కామెంట్స్‌ – heroine nithya menen shocking comments on santosh varkey

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *