పసుపు బోర్టు ప్రేమతోనా..? లేక పట్టుకోసమా..?

నిజామాబాద్ రైతులు చిరకాల డిమాండ్ గా మిగిలిన పసుపుబోర్డు ఏర్పాటుకు అడ్డంకులు తొలిగిస్తే మోదీ నిర్ణయం తీసుకున్నారు. అయితే పసుపు బోర్టు రైతులపై ప్రేమతోనా..? పట్టు కోసమా..? అంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి.

తెలంగాణ ఎన్నికలు సమీస్తున్న వేళ.. బీజేపీ పెద్దలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మరిచిపోయిన హామీలను డిమాండ్ లేకపోయిన వెంటనే వాటిని గుర్తుపెట్టుకుని నెరవేర్చుతున్నాం అని కలరింగ్ ఇచ్చి ప్రకటిస్తున్నారు. నిజానికి నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కొన్ని దళాబ్ధాలుగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల వేళ.. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో నేతల ఓట్ల కోసం ఇచ్చే చెత్త హామీల్లో పసుపు బోర్డు సాధించి రైతులకు అంకితం చేస్తాం అని ఊకదంపుడు ప్రసంగాల్లో దీన్ని వల్లేవేస్తుంటారు. ఇది ఇక్కడ వారు కొన్ని దశాబ్ధాలుగా చూస్తున్నదే.. వింటున్నదే. అయితే కేంద్రం ఏర్పాటు చేయాల్సిన జాతీయ పసుపు బోర్డు కొన్నేళ్ళుగా కాగితాలాకే పరిమితం అయ్యింది.

నిజామాబాద్ పసుపు రైతుల ఆవేదన  ఈ నాటిది కాదు.  ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్స్   ఎప్పటినుంచో ఉన్నదే..  కానీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో  ప్రభుత్వాలు ఎన్ని మారిన  ఇక్కడ పసుపు రైతుల తలరాతలు మారడం లేదు.  నిజామాబాద్  బీజేపీ ఎంపీ అరవింద్ కూడా పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంతో కృషి చేశారు.  గతంలో కూడా కేసీఆర్ కూతురు కవిత  పసుపు బోర్డు కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. నేటి బీజేపీ లు కనీసం స్పందించలేదు.  

కానీ  తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో  బిజెపి అధిష్టానానికి..,  ప్రధాని మోదీకి  నిజామాబాద్  రైతుపై  ప్రేమ తన్నుకొస్తోంది. రైతులు చేస్తున్న డిమాండ్లను నెరవేర్చేందుకు మోదీ పనిగట్టుకుని తెలంగాణ వచ్చి.. హామీ ఇచ్చారు. తెలంగాణలో రెండు రోజులు పర్యటనలో భాగంగా మోదీ  మహబూబ్ నగర్ వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.  అలానే అక్కడ ఏర్పాటు చేసిన సభలో  నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.  దీంతో  నేటి ప్రధాని నిజామాబాద్ పర్యటన కొంత ప్రధాన్యత సంతరించుకుంది. మోదీ పర్యటనలో భాగంగా బీజేపీ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడతారు. ఈ సభకు నిజామాబాద్ లోని ఏడు నియోజకవర్గాలతో పాటు కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల  జిల్లాల నుంచి  రైతులను పార్టీ శ్రేణులు తరలిస్తున్నాయి.

నిజాంబాద్ పర్యటనలో భాగంగా  8 వేల 21 కోట్ల విలువైన ప్రాజెక్టులను  మోడీ ప్రారంభించునున్నారు.  రామగుండం ఎన్టీపీసీ లో  నూతనంగా నిర్మించిన 800 మెగా ఓట్ల విద్యుత్ ప్రాజెక్టును  మోడీ ప్రారంభించి.., రాష్ట్ర ప్రజలకు అంకితం చేయనున్నారు.   విద్యుత్తు, ఆరోగ్య, రైల్వే ప్రాజెక్టులను మోడీ శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభోత్సవాలను ముగించుకున్న అనంతరం ఇందూరు సభకు హాజరవుతారు. ఇప్పటికే బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.