పెడనలో పవన్ పదెం నెగ్గేనా..? తుని ఘటన పునరావృతమా..?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఐదు రోజుల పవన్ వారాహి యాత్ర విజయవంతానికి టీడీపీ, జనసైనికులు కసరత్తు చేస్తున్నారు. ఈ లోపు నిన్న పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే కలకలం రేపుతున్నాయి.

తెలుగు దేశం.., జనసేన పొత్త ప్రకటించిన తరువాత జనసేనానిని పవన్ నాలుగొవ విడత వారాహి యాత్ర ఉమ్మడి కృష్ణాజిల్లాలో విజయవంతంగా సాగుతోంది. అవనిగడ్డ.., మచిలీపట్నం ముగించుకుని ఈ రోజు పెడన వెళ్ళారు పవన్. అక్కడ తోటమూల సెంటర్లో ఈ రోజు (బుధవారం) సాయంత్రం 5 గంటలకు వారాహి యాత్రలో భాగంగా బహిరంగ సభలో పవన మాట్లాడుతాడు. ఇదే అంశంపై నిన్న మచిలీపట్నంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. పెడనలో అల్లర్లు జరుగుతాయి.. పులివెందుల నుంచి 2 వేల మంది రౌడీమూకలు దిగాయంటా.. బహుపరాక్ జనసేనికులు అంటూ హెచ్చరించారు. వాళ్లు 2 వేల మందే.. మనం రెండు లక్షల మంది.. ఎంతమంది వచ్చిన కాళ్ళు చేతులు కట్టి పోలీసుస్టేషన్ తీసుకెళ్లి పడేయండి అంటూ సూచించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై కూడా విరుచుకుపడ్డారు. జగన్ .. జగన్ అంటూ ఏక వచనం తో వార్నింగ్ ఇస్తూ.. పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మీడియాతో పాటు సోషల్ మీడియా హల్చల్ చేస్తున్నాయి.

ఉమ్మడి కృష్ణాజిల్లా పెడన అంటేనే హీటేడ్ కానిస్టేన్సీ అని చెప్పాలి. ఎందుకంటే వైసీపీ ఫైర్ బ్రాండ్.., ప్రస్తుతం కేబినెట్ మంత్రి జోగి రమేష్ నియోజకవర్గం కూడా. అందుకే పవన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రౌడీ మూకలతో అల్లర్లు సృష్టిస్తారన్న ముందస్తుగా పవన్ కున్న ఇంటిలిజెన్సీ సమాచారంతోఆయన మాట్లాడారు. పవన్ కామెంట్స్ తో ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఇది మరో తుని ఘటనకు దారితీసిద్దేమోనని పోలీసు వర్గాలు ముందస్తు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏదైన జరగరాని విధ్వంసం జరిగితే.. ఏ రాజకీయ పార్టీకి లబ్ధి అన్నది పక్కన పెడితే.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నట్లు నిన్నటి నుంచే విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఏదీఏమైనా పెడనలో అమీతుమీ తేల్చుకుంటామని జనసైనికులు సైతం మరోవైపు సిద్దమయ్యారు.

ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయాలు హీటెక్కి ఉంటే.. పవన్ వారాహి యాత్రలో వాడుతున్న డైలాగ్స్ కొత్త చిచ్చుకు దారితీస్తున్నాయి. ఏదీఏమైన ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కొంచెం తగ్గి రాజకీయాలు చేస్తే ఏ పార్టీకైన ఏపీలో భవిష్యుత్తు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.