ఐదొవ విడత వారాహి యాత్రకు రంగం సిద్ధం..!

జనసేనాని పవన్ కళ్యాణ్ ఐదొవ విడుత వారాహి యాత్రకు సిద్ధమవుతున్నారు.అయితే ఎక్కడ నుంచి అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.  

జగసేనాని పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రతో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. ఇప్పటికే నాలుగు విడుతలగా ఏపీలో వారాహి యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని ఐదొవ విడుతగా ఏ జిల్లా నుంచి ప్రారంభించాలో పార్టీ సీనియర్స్ తో సమాలోచన చేస్తున్నారు. నిన్న రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి మంగళగిరి కార్యాలయాలనికి వచ్చిన పవన్.. పార్టీ పొలిటికల్ అఫైర్ కమిటీ చైర్మన్ నాదేండ్ల, రాష్ట్ర స్థాయి నాయకులతో చర్చించారు. వారాహి ఐదొవ విడతను ఏ జిల్లా నుంచి ప్రారంభించాలి. ఏ సమస్యను ప్రధానంగా తీసుకుని మాట్లాడాలి అన్నదానిపై చర్చించుకున్నారు. అలానే తెలుగు దేశం పార్టీ ఉమ్మడి కార్యాచరణ కమిటీతో చర్చించి త్వరలో నిర్ణయం ప్రకటిస్తామన్నారు పవన్.

నాలుగు విడతల వారాహి యాత్రలో అనేక సమస్యలపై గళమెత్తిన పవన్ .. ఈ సారి రైతు సమస్యపైనే మాట్లాడి.. అందుకు తగిని న్యాయం చేసేలా పోరాడాలని  నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, అన్నవరం సత్యదేవుని ఆలయం నుంచి ప్రారంభించిన వారాహి మొదటి విడత తణుకులో ముగిసింది. అలానే రెండో విడత ఏలూరు నుంచి, మూడో విడుత విశాఖ నుంచి.., నాలుగొవ విడత ఉమ్మడి  కృష్ణాజిల్లా నుంచి వారాహి యాత్రలను చేసి విషయం తెలిసిందే.

ఈ నేపధ్యంలో ఐదొవ విడుత ప్రధానంగా రైతాంగ సమస్యలపైనే యాత్రలో ప్రస్తావించాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఉమ్మడి గుంటూరు నుంచి ప్రారంభిస్తారా.. లేక ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తారా..? అన్నదానిపై క్లారిటీ రాలేదు. ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడులో రైతుల పరిస్ధితి అత్యంత ధీనస్ధితిని చూస్తున్నారు. ఆ ప్రాంతాలలో ఎక్కడ చూసినా.. సాగు నీరు, వర్షపాతం లేక బీడులు పెట్టుకున్న పొలాలే కనిపిస్తుంటాయి. సేద్యం సాధ్యం కాక రైతు సాగును వదిలేసి కూలినాలి చేసుకుని జీవనం వెల్లబుచ్చుతు న్నారు. ఈ నాలుగేళ్ళల్లో ఎన్నడూ పంట నష్ట పరిహారాలు, కరువు సాయం వంటివి ప్రభుత్వం ప్రకటించడం రైతులు చూడలేదన్నది వాస్తవం.