కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏదీ సాధ్యపడలే..!

నీళ్లు, నిధులు, నియామకాలు కోసం సాగించిన తెలంగాణ పోరాటం.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి తరువాత అవి ఎక్కడా అందిన దాఖలాలు లేవని జనసేన అధ్యక్ష్యుడు పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు.

హైదరాబాద్ ఎల్బీ స్ట్రేడియంలో బీజేపీ ఏర్పాటు చేసిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సభకు బీజేపీ ముఖ్య నేతలతోపాటు జనసేనాని పవన్ కళ్యాణ్ కు కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణ ఉద్యమం, ఉద్యమం చేసిన తీరును గుర్తు చేసుకున్నారు. సకల జనులు సమరం చేస్తే తెలంగాణ వచ్చిందని.. జల్, జంగల్ .., జమీన్ అంటూ కుమురం భీం పోరాడారని చెప్పుకొచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాలు కోసం సాగించిన సమరం.., ఆ తరువాత అవి అందరికీ అందలేదడం లేదన్నారు. బీజేపీకి జనసేన సంపూర్ణ మద్దతు తెలుపుతుందని.., తిరిగి మోదీని మరోసారి ప్రధాని చేయడంలో జనసేన పాలిభాగస్వామి అవుతుందని చెప్పుకొచ్చారు.

మొత్తానికి బీసీని ముఖ్యమంత్రిని చేస్తనన్న బీజేపీ స్టాండ్ ను పవన్ సాధరంగా ఆహ్వానించారు. అయితే ఈ క్రమంలోని తెలంగాణ వచ్చిన తరువాత దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ ఆ విషయాన్ని విస్మరించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో జరిగే మూడో సాధారణ ఎన్నికల సమరంలో ఇప్పటికైనా బడుగుల కల నెరవేరిద్దో లేదో చూడాలి.