పొన్నాల నిష్క్రమణకు కారణాలు ఇవేనా..?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.., మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీకి గుడ్ బై చెప్పాడు.

తెలంగాణ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రతిపక్ష కాంగ్రెస్ లో ములసం మొదలైంది.  సీనియర్లందరూ దూరంగా ఉంటూ చివరికి ఒక్కొక్కరిగా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారా..? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయం.., బీసీ నేత.., మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇదే రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ మారింది.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒంటెద్దుపోకడ.., సీట్లు కోట్లకు భేరం.., సీనియర్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, రెడ్డి సామాజీక వర్గానికి పెద్ద పీట వేయ్యడం వంటివి కాంగ్రెస్ లోని  బీసీ..,ఎస్సీ.., ఎస్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. జనగామ నుంచి బరిలో ఉంటనని పట్టుపట్టి పొన్నాల లక్ష్మయ్యకు అసలు టికెట్టే లేదని మోహాన్ని చెప్పడంతో తీవ్ర నిరాశతో తన 40 ఏళ్ళ కాంగ్రెస్ ప్రయాణానికి స్వస్తి పలికాడు. పార్టీకి రాజీనామా చేసి.. గుడ్ బై చెప్పడం పొటికల్ గా తీవ్ర దూమరాన్ని రేపుతోంది. మాజీ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన పొన్నాలకు సైతం సీటు ఇవ్వం అని చెప్పడంపై కాంగ్రెస్ తీసుకుంటున్న స్టాండ్ ఏ పాటిదో ఇట్టే అర్ధమవుతోంది. సర్వేలను నమ్ముకుని సీనియర్లును సైతం పక్కన పెడుతున్న కాంగ్రెస్ అధిష్టానం కనీసం దశాబ్ధాలుగా పార్టీని నమ్ముకున్న వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం శోచనీయం.

ఇదిలా ఉంటే జనగామ అసెంబ్లీ స్ధానానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ పల్లా  రాజేశ్వర్ రెడి బరిలో దింపడంతో ఇక్కడ రాజకీయ సమీకరణాలు మారాయి.దీంతో కాంగ్రెస్ రెడ్డి సామాజీక వర్గం నుంచి అభ్యర్ధిని బరిలో దించాలని భావించింది.  ఈ నేపధ్యంలో ఇక్కడ నుంచి కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలుస్తాడని.., సర్వేలు చెబుతున్నాయన్న వాస్తవాలను అధిష్టానం వాదిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే జనగామ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచి.. వివిధ శాఖల్లో కెబినెట్ మినిస్టర్ గా పనిచేసిన అనుభవం ఉన్న పొన్నాలను కాదని కాంగ్రెస్ పార్టీ ప్రతాప్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేడయం గమనించిన ఆయన పార్టీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే అంశం తెలంగాణ బీసీ వర్గాలను  తీవ్ర నిరాశ పర్చుతోందని విశ్లేషణలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి.  ఇది తెలంగాణ గడ్డపై బ్రతికేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కు అంత మంచిది కాదని పొటికల్ అనలిస్ట్ లు విశ్లేషిస్తున్నారు.