కాంగ్రెస్ లో కాకరేగుతున్న అభ్యర్ధుల ప్రకటన..!

తెలంగాణ ఎన్నికలు వేళ.. కాంగ్రెస్ కేడర్ లో నిరసన సెగలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్ధుల తొలి జాబితా ఆ పార్టీలో కాకరేపుతోంది.

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. బీఆర్ఎస్ ఇప్పటికే 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించి ప్రచారంలో ముందు వరసలో ఉండగా.. కాంగ్రెస్ తొలిజాబితా 55 మంది అభ్యర్ధులను ప్రకటించింది. దీంతో శనివారం సర్వత్రా విమర్శలు..,నిరసనలతో రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్లు రోడ్డెక్కి కాంగ్రెస్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గాంధీ భవన్ ముట్టడించి మైనారిటీలు.., గేట్లకు తాళాలు వేసి ఆగ్రహం  వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగూర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ టికెట్లను కొత్తగా వచ్చిన వారికి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని పీసీసీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాదర్ పాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే మేడ్చల్ టికెట్ ను బోడుప్పల్ నివాసి తోటకూర జంగయ్య యాదవ్ కు కేటాయించడంతో ఆ టికెట్ ను ఆశించిన హరివర్థన్ రెడ్డి ఆగ్రహంతో రగిపోతున్నారు. అంతేలా ఉప్పల్, ముషీరాబాద్ టికెట్ల విషయంలో ఆశించిన వారి భంగపాటు తప్పలేదని కేడర్ రోడ్డుపైకి వచ్చి అవేదన వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి కాంగ్రెస్ లో ప్రస్తుత పరిస్ధితినిబట్టి చూస్తే కేడర్ విచ్చిన్నమై.. రాజీనామాల పరంపర కొనసాగేలా కనిపిస్తోంది. దీంతో బీఆర్ఎస్ కూడా ప్లాన్ -బి అమలుతో ప్రకటించిన అభ్యర్ధుల మార్పులతో బిజీబిజీగా ఉంది.