చంద్రబాబు అరెస్ట్ తో ఏపీలో రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. టీడీపీ వర్సెస్ వైసీపీ గా సాగుతున్న విమర్శల యుద్ధం దేనికి దారి తీసిద్దొ అర్థకాని పరిస్ధితి.

స్కిల్ స్కాంలో అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ శ్రేణులు.. సానుభూతిపరులు రోడ్డుపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో ముఖ్యమంత్రి జగన్..,  వైసీపీ మంత్రులపై దుమ్మెత్తిపోస్తున్నారు. టీడీపీ సీనియర్ నాయకులైతే లైన్ క్రాస్ చేసి మరి ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. అందుకు ప్రతీగా వైసీపీ కూడా గట్టి కౌంటర్లే ఇస్తోంది.

ఈ నేపథ్యంలో వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి రోజా తన కామెంట్స్ తో చంద్రబాబు, లోకేష్ లపై ఒక రేంజ్ లో రెచ్చిపోయారు. కొంచెం పరుష పదజాలాన్ని కూడా వాడారు. దానితో  ఆగకుండా భువనేశ్వరి.., బ్రాహ్మణిలపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. రోజా కౌంటర్లుకు టీడీపీ సీనియర్లందరూ రీ – కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ రోజాపై ధ్వజమెత్తారు. బ్లూ ఫిలీం సీడీలు ఉన్నాయంటూ రోజాను దుయ్యబట్టారు. ఆ తరువాత మంత్రి రోజా మీడియా సమావేశంలో ఏడవడం.. తరువాత బండారు అరెస్ట్ జరగడం.. అన్నీ క్రమపద్దతిలో జరిగిపోయాయి.

అయితే.., ఈక్రమంలో రోజాకు మద్దతుగా సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిచారు. బండారు సత్యనారయణపై ధ్వజమెత్తారు. మహిళలను ఇలాగానే అవమానించడం ఏమిటని నిలదీశారు. సంస్కారం హీనుడా అంటూ సీనియర్ నటి కవిత.., రాధిక, మీనా, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ లు ఆగ్రహం వక్తం చేశారు.

ఈ నేపధ్యంలో నిన్న రాత్రి సినీ నటి రమ్యకృష్ణ కూడా తన సోషల్ మీడియాలో స్పందించారు. సెల్ఫీ వీడియో తీసి పోస్ట్ చేశారు. మన దేశంలో మాత్రమే భారత్ మాతాకీ జై అని గర్వంగా చెప్తామని.. అలాంటి ఈ దేశంలో మహిళల పట్ల ఇలా అసభ్యకరంగా ప్రవర్తిస్తారా..? అంటూ నిలదీశారు. కులాలు.., మతాలు.., ప్రాంతాలు.., జెండర్స్ తో పనిలేకుండా బండారు కామెంట్స్ ను ఖండించాలని పిలుపునిచ్చారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన బండారును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ.., సీఎం జగన్ లు ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.