హ్యాట్రిక్ విజయాలతో మరో చిత్రానికి క్లాప్..!

రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మరోసారి ఓ క్రేజీ చిత్రానికి క్లాప్ కొట్టారు.ఇప్పటికే డాన్ శ్రీను, బలుపు, క్రాక్ చిత్రాలు హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న ఈ కాంబినేషన్ మరో సారి సెట్ అయ్యింది.

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మలినేని గోపిచంద్ దర్శకత్వంతో నాలుగొవ సినిమా చేస్తున్న రవితేజ ఖాతాలో మరో విజయం ఖాయమని ఇప్పటికే టాక్ నడుస్తోంది. ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించిన సంగతి తెలిసిందే.

వాస్తవ సంఘటనలు, యూనిక్, పవర్ ఫుల్ కథతో ఈ చిత్రం రూపొందనుంది. కొన్నినెల క్రితం ఈ సినిమా అప్డేట్ ను కూడా మేకర్స్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. బ్లాస్టింగ్ అప్డేట్ కోసం సిద్ధంగా ఉండండి అని చేసిన ట్వీట్ అభిమానులలో నూతన బజ్ క్రియేట్ చేసింది. మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ నేపధ్యలో తెరకెక్కుతున్న చిత్రంలో రవితేజ ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నారు.

చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. చిత్రంలో తమిళ దర్శకుడు, నటుడు సెల్వ రాఘవన్ కీలక పాత్రలో పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఆయన చుట్టే కథ నడుస్తోందని టాక్ నడుస్తోంది. అంతేకాక ధమాకా లో రవితేజకు సూపర్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల హీరోయిన్ గా చేస్తున్నట్లు తెలుస్తోంది. అలానే థమన్ సంగీతం అందిస్తున్నారు.