రోజాపై ఫైర్ ..రాజకీయాల్లో కుల దూషణలు ఎందుకు..?

రాజకీయం అంటేనే సద్ది విమర్శలు.., ఎద్దేవా, ఆరోపణలు.., ప్రత్యారోపణలు. వీటికే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు ఆ నాటి నేతలు. కానీ నేడు విమర్శలకు కాలం మారింది.

ఏపీలో ఇప్పుడు నడుస్తోంది  జగన్ మోహన్ రెడ్డి పాలన.  ఈ నాలుగునరేళ్ళ జగన్ పాలనలో బజారు మనుషులు కన్నా దారుణంగా బూతులు.., వ్యక్తిగత దూషణలను వైసీపీ నేతల నోట జాలువారినవి విన్నం. అమ్మ నా బూతులు తిట్టే ప్రావిణ్యం ఉన్న వైసీపీ మంత్రులు.., ఎమ్మెల్యేలు ఎవరు అని గూగుల్ సెర్చ్ ని అడిగితే.. వారి నీచపు కూతలు ఇట్టే బయటకొస్తాయి. కొడాలి.., రోజా.., అంబటి..,అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, ద్వారంపూడి, వల్లభనేని ఇలా డజన్ల కొద్ది వైసీపీ నేతలు పరుషపదజాలంలో విపక్షలపై విరుచుకుపడతారన్నది తెలిసిందే. రాజకీయాల విమర్శలు శృతిమించి.. నేతల ఇంటి దాక చేరుతున్నాయి. ఇంట్లో ఉన్న నేతల తల్లి, చెల్లి, భార్య లను సైతం వదలకుండా వారి వ్యక్తిగత జీవితాన్ని బయటకు తీసుకొచ్చి నోటికి పట్టరాని బూతులు తిట్టడం గత రాజకీయాల్లో ఎన్నడూ చూడలేదు అన్నది వాస్తవం.  

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జాతీయ,ప్రాంతీయ పార్టీల నేతల రాజకీయాలు ఎన్నికల సమయంలోనే కొద్దిపాటి వాడివేడి డైలాగ్స్ ను వాడతారు. అది కూడా పార్టీల విధివిధానాలు, నాయకుడి వైఫల్యాలను, ప్రభుత్వ పని తీరును మాత్రమే ప్రస్తావించే వారు. కానీ మాట తూలడం, బూతులు దొర్లడం, కుటుంబ సభ్యుల వ్యక్తిగతంపై విమర్శలు చేయడం వంటివి ఒక్కశాతం కూడా అగుపించేవి కావు. కానీ జగన్ రెడ్డి రాకతో విమర్శలకు కాలం మారింది. ఈ కోవలోనే నిన్న  రోజా తన నోటికి మరోసారి పని చెప్పింది. తీవ్ర విమర్శలు పాలైంది.

ఉమ్మడి కృష్ణాజిల్లా పర్యటనలో ఉన్న మంత్రి రోజా.. విపక్షాన్ని ఉద్దేశించి విమర్శిస్తూ.. బుడబుక్కల కులంతో కంపేర్ చేసి మాట్లాడారు. దీంతో ఏపిలోని బుడబుక్కల కులాల సంఘాలు భగ్గుమన్నాయి. ఆ సంఘ పెద్దలు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కులాన్ని నీచ రాజకీయాలకు అంటగట్టే హక్కు మీకెవరిచ్చారు రోజా అంటూ నిలదీస్తున్నారు. జిల్లాలు వారీగా మంత్రి రోజాపై పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నారు ఆ సంఘ పెద్దలు. తప్పు తెలుకుని చేసిన వాఖ్యాలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలాని డిమాండ్ చేస్తున్నారు.