ప్రగతి రథచక్రాలు పతనం..!

ఏపీలో వరుస ఆర్టీసీ ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమన్న నానుడి నేడు రక్షితం కాదు అన్న విమర్శలు పెద్దఎత్తున వినివస్తున్నాయి.

ఏపీలో ఆర్టీసీ బస్సులు ప్రయాద ఘంటికలు మోగిస్తున్నాయి. రోడ్డుపైకి వస్తున్న ప్రతి బస్సు గమ్యానికి చేరుకునే వరకు నమ్మకం ఉండడం లేదు. మొన్న విజయవాడ బస్టాండ్ లో ఆర్టీసీ బస్ చేసిన హల్చల్ అందరూ చూసే ఉంటారు. ఒళ్ళుగగూర్పొడిచే ఆ సంఘటనలో కండెక్టర్, మరో మహిళా మృతి చెందగా.., ఓ చిన్నారి చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. అలానే ముగ్గురుకి గాయాలయ్యాయి.

ఆటో గేర్ ను రాంగ్ యూజ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని కమిటీ నివేదిక ఇచ్చింది. బస్ డ్రైవర్ ప్రకాశంతోపాటు మరో ఇద్దరి అధికారులను సస్పెండ్ చేసింది ఆర్టీసీ యాజమాన్యం. ఇదిలా ఉండగా .. 24 గంటలు గడవకముందే విజయవాడ గవర్నర్ పేట లో బస్సు రివర్స్ చేస్తున్న క్రమంలో కార్గో ఉద్యోగి సురేశ్ పైకి దూసుకెళ్లింది. సురేష్ కు కాలు విరగడంతోపాటు తీవ్ర గాయాలయ్యాయి.

ఇలా వరుస సంఘటనలు ఆర్టీసీ యాజమాన్యాన్ని తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. మరోవైపు ఆర్టీసీ సంఘాలు యాజమాన్య పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 50 శాతం బస్సులకు ఫిట్నెస్ సరిగా లేవని.., డ్రైవింగ్ చేయాలంటే వెన్నులో వణుకు పుడుతోందని వాపోతున్నారు.డ్యూటీ అంటేనే  గుదిబండలా మారిన పరిస్ధితి దాపురించిందని అవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పదేళ్ళుగా ఖాళీగా ఉన్న డ్రైవర్ పోస్టులను బర్తీ చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపిస్తున్నారు.

మరోవైపు జగనన్న గోతుల రోడ్లపై బస్సులు నడపాలంటే సహాసం చేయాల్సి వస్తోందని అవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ సంఘాలు. దీంతో ప్రగతి రథ చక్రాలు పతనం మొదలైందనట్లు కనిపిస్తోంది. ఆర్టీసీ సంఘాల డిమాండ్స్ ను త్వరతిగతిన దృష్టిసారించకుంటే ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయన్నది ప్రయాణులకు ఆందోళన చెందుతున్నారు.