సోషల్ మీడియా ఇప్పుడు వీవ్స్ కోసం నెగటీవ్ ట్రోల్స్ కు బాగా మొగ్గుచూపుతోంది. దీంతో ఫాల్స్ ట్రోల్స్ చేస్తూ ప్రముఖులను సైతం అప్పుడప్పుడు చంపేస్తుంటారు. ఇదే తరహా నటి సనా జీవితంలో కూడా తొంగిచూసింది.

సోషల్ మీడియా ఇప్పుడు వీవ్స్ కోసం నెగటీవ్ ట్రోల్స్ కు బాగా మొగ్గుచూపుతోంది. దీంతో ఫాల్స్ ట్రోల్స్ చేస్తూ ప్రముఖులను సైతం అప్పుడప్పుడు చంపేస్తుంటారు. ఇదే తరహా నటి సనా జీవితంలో కూడా తొంగిచూసింది. సనా సుసైడ్ చేసుకుని హాస్పటల్లో ఉందని.. మరికొందరైతే చచ్చిపోయిందని యూట్యూబ్ లో వార్తలను వండి వారుస్తున్నారు. దీనిపై స్సందించిన సనా అదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది.

నేనేమీ సూసైడ్ చేసుకోలేదని.. అంత కర్మ కూడా నాకు పట్టలేదని సెల్ఫీ వీడియో సందేశాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది సనా. కొన్ని యూట్యూబ్ చానెల్స్ రేటింగ్ కోసం ఇలా నాపై ట్రోల్ చేస్తున్నాయని.. వాటిపై లీగల్ గా ఫైట్ చేయొచ్చు..కానీ.. నాకు ఇదంతా టైం వేస్ట్ అని.. చెప్పుకొచ్చింది.

సీనియర్ నటి సనా గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వెండితెరపై ఎన్నో సినిమాల్లో నటించారు ఆమె. సపోర్టింగ్ రోల్స్.., తల్లి పాత్రలు చేస్తూ సనా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సూపర్ డూపర్ హిట్ చిత్రం ‘నిన్నే పెళ్లాడతా’ తో తన కేరియర్ ను సాధించి.. వందల సినిమాల్లో నటించింది.బుల్లితెరపై ‘చక్రవాహం’ సీరియల్ లో తన నటనతో ఆకట్టుకుంది.

రేటింగ్ కోసం ఇలా దుష్ప్రచారం చెయ్యొద్దని.., కష్టపడి ఏదో ఒకటి చేయండి అని చెప్పారు. ఇలా పేక్ న్యూస్ చేస్తే ఫ్యామిలీ సభ్యులు బాధపడతారని..సోషల్ మీడియా కొన్ని ఎథిక్స్.. మోరల్స్ పాటించాలని సలహాలిచ్చారు.