చంద్రబాబుపై ఏకంగా 12 కేసులు..!కుట్రలు పారేనా..?

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఏకంగా12 కేసులు పెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

స్కిల్ కేసు తరువాత ఇప్పటికీ చంద్రబాబు నాయుడుపై 5 కేసులు నమోదు అయ్యాయి. స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్, ఫైబర్ గ్రిడ్, రాజధాని ఇన్నరింగ్ రోడ్డు అలైన్మెంట్, మద్యం, ఇసుక వంటి వాటిలో చంద్రబాబు హయంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని అభియోగాలు మోపుతూ పలు సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసింది. అలానే అంగళ్ళల్లో చంద్రబాబు ప్రేరిపిస్తేనే గొడవ పెద్దదైందని .., అందుకే పోలీసులు గాయపడ్డారని ఆరోపిస్తూ ఆయనతోపాటు పార్టీ శ్రేణులపై కేసు నమోదు చేశారు. ఇలా మొత్తంగా ఆరు కేసులు చంద్రబాబుపై నమోదు అయ్యాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు కేసుల లిస్టే పెద్ద చర్చగా మారింది.

స్కిల్ కేసులో 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు అనారోగ్య కారణాల రిత్యా ఆయనకు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జైల్లో ఉన్నప్పుడు అంగళ్ళు, ఫైబర్ గ్రిడ్, ఇన్నరింగ్ రోడ్డు అలైన్మెంట్ ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి.. ఏసీబీ కోర్టులో పీటి వారెంట్ పిటిషన్ ను సీఐడీ ఫైల్ చేసింది. బెయిల్ పై చంద్రబాబు పోయిన నెల 31 వ తేదీన బయటకు వచ్చారు. వచ్చిన వెంటనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చారని ఆరోపిస్తూ..కేసు మరో కేసు నమోదు చేసింది సీఐడీ. ఇదిలా ఉంటే మొన్న ఇసుకలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఇంకో కేసును చంద్రబాబుపై నమోదు చేశారు. ఇలా ఆరు కేసులు ఆరుగురు రెడ్లు కలిసి.., కూడపలుకుని సీఐడీకి ఫిర్యాదు చేశారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది.

ఇవన్నీ జగన్ కావాలనే కుట్రపూర్వకంగా కేసులు పెడుతున్నారని టీడీపీ నాయకులు మండిపడుతోంది. స్కిల్ కేసును అజయ్ రెడ్డి, అంగళ్ళ కేసు ఉమాపతిరెడ్డి, ఫైబర్ గ్రిడ్ కేసు గౌతంరెడ్డి, ఇన్నరింగ్ అలైన్మెంట్ కేసు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మద్యం కేసు వాసుదేవరెడ్డి, ఇసుక కేసు వెంకటరెడ్డిలు పిటిషనర్లుగా ఉన్నారు. వీరే చంద్రబాబుపై సీఐడీకి ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి.. ఏసీబీ కోర్టుకు ఎఫ్ఐఆర్ లు సబ్మిట్ చేశారు. అయితే కొన్ని కేసులకు రెగ్యూలర్ బెయిల్ ఇవ్వగా.., కొన్ని కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉండగా.. చంద్రబాబుపై మరో 6 కేసులు నమోదు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ సీఎం జగన్ 11 కేసులో ముద్దాయిగా ఉండి 16 నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చారు. ఆయనలాగే చంద్రబాబుపై కూడా ఆయనకన్నా ఎక్కువ కేసులు నమోదు చేస్తే ప్రతిపక్ష నేతపై కూడా నా కంటే ఎక్కువ కేసులు ఉన్నాయని.., వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు అస్త్రంగా మార్చుకునే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబుపై వరుస కేసులను నమోదు చేస్తున్నారని తెలుగు దేశం నేతలు ఆరోపిస్తున్నారు.