జగన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన షర్మిల..!

రాజకీయాల్లో ప్రత్యర్ధులు తిట్టుకోవడం.., విమర్శలు చేసుకోవడం షరా మామూలుగానే కనిపిస్తోంది. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అన్న జగన్ ను పట్టుకుని చెల్లిల్లు విమర్శ చేయడం దేశం రాజకీయాలు ఇదే ప్రధమం.

వైఎస్ఆర్టీపీ తెలంగాణ పార్టీ వ్యవస్ధాయ  అధ్యక్షురాలు.., దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల గేర్ మార్చింది. రాజకీయం ఎప్పుడూ దూకుడుగా ఉండే షర్మిల తెలంగాణ ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ తో తన పార్టీ ఎటువంటి షరతులు లేని మద్దతును ప్రకటించిన షర్మిల… ఆ తరువాత కేసీఆర్ పై వరస మీడియా సమావేశాల్లో విరుచుకుపడుతున్నారు. దీంతోపాటు కేసీఆర్ కు జీ హుజూరు అనే ఏపీ సీఎం జగన్ పై.., ఆయన జీతగాడిలా కొనసాగే సకల శాఖ మంత్రి సజ్జలపై సోమవారం నిప్పులు చెరిగారు.

గతంలో తాను పార్టీ పెడుతున్నప్పుడు షర్మిలతో సంబంధం లేదు అన్న సజ్జల.. ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుంటే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఇది జగన్ రెడ్డికి కూడా వర్తిస్తోందని ఘాటుగానే మీడియా ముఖంగా చెప్పారు. అంతేకాక సీఎం కేసీఆర్ వేదికలపై పదేపదే ఏపీ ప్రభుత్వ పనితీరును  ఎండగడుతున్నారని.., అక్కడి రోడ్లను, విద్యుత్తును, ప్రభుత్వం అందించే వైద్యంపై నిత్యం విమర్శిస్తున్నా ఎందుకు స్పందించరు..? అంటూ నిలదీశారు. కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు సజ్జల ఎందుకు సమాధానం చెప్పలేక పోతున్నారని ప్రశ్నించారు. మిస్టర్ సజ్జల మీ పని మీరు చూసుకోండి.. నన్ను రాజకీయంగా కెలక్కండి అంటూ ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు షర్మిల.

షర్మిల వ్యాఖ్యల్లో నిజం ఉంది కాబట్టే సోషల్ మీడియా మొత్తం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. షర్మిల పొలిటికల్ కేరియర్ సర్వనాశనం చేసేందుకు సొంత అన్నగా ఉన్న జగన్ రెడ్డే పరోక్షంగా కంకణం కట్టుకున్నారన్నది వాస్తవం కాదా..? అని ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. కాంగ్రెస్ తో షర్మిల జోడి కొనసాగించాలని అడుగులు వేస్తే.. తెర వెనుకుండి సోనియా, రాహుల్ తో మాట్లాడింది మీరు కాదా..? జగన్ అంటూ ప్రశ్నలు లేకపోలేదు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ స్థానాలు మీకు కుదువ పెడతానని రాహుల్ వద్ద జగన్  ఒప్పందం చేసుకున్నారని బీజేపీ నేతలే ఆరోపిస్తున్నారు. ఇదంత షర్మిలకు పూసకుచ్చినట్లు సోనియా వివరించారు. మీ అన్న చెల్లిల్లు మధ్య గొడవలు పెట్టమని.. అందుకే ఆలోచించి నిర్ణయం చెబుతామని ఆ మధ్య ఢిల్లీలో జరిగిన షర్మిల ములాకత్తులో సోనియా, రాహుల్ కుండబద్దలు కొట్టి మరి చెప్పారు.

ఈ ఒక్క హింట్ చాలు కదా.. షర్మిల పతనానికి స్కెచ్ ఎవరు వేస్తున్నారు..? దాని వెనుక ఏ విధమైన పావులు కదుపుతున్నారు..? అన్నది సో క్లియర్.  అందుకే షర్మిల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. అటూ నమ్మించి నడి సంద్రంలో వదిలేసిన తోడపుట్టిన అన్న జగన్ తో.. ఇటు సెంటిమెంట్ తో  నమ్ముకున్న ప్రజలను మూసినదిలో ముంచిన కేసీఆర్ తో యుద్ధం చేసేందకు షర్మిల సిద్ధమయ్యారు. అందుకే షర్మిల తనదైన శైలిలో ఘాటు విమర్శలు దిగుతున్నారు. ఎక్కడ తగ్గేదేలే అంటూ ప్రజల కోసం కాంగ్రెస్ గెలుపును కాంక్షిస్తున్నారు షర్మిల. ఇదే అన్న జగన్ కు, సీఎం కేసీఆర్ కు మింగుడు పడటంలేదని విశ్లేషణలు లేకపోలేదు.