షర్మిల సంచలన నిర్ణయం..బీఆర్ఎస్ కు దెబ్బ అదుర్సా..?

తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. గెలుపుకు కలిసొచ్చే అంశాలపై చాలా నిశితంగా ఆలోచించి అడుగులు వేస్తోంది.

వైఎస్ఆర్టీపీ వ్యవస్ధాపక అధ్యక్షురాలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డగా రెండు తెలుగు రాష్ట్రాల్లో షర్మిలకు మంచి గుర్తుంపు ఉంది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ తోపాటు తెలంగాణలో తనదైన శైలిలో అన్న జగన్ రెడ్డి కోసం.., వైసీపీ కోసం ఆమె చేసిన ప్రచారం, పాదయాత్ర అనూహ్య రితిలో పొలిటికల్ ప్రచుర్యాన్ని తెచ్చిపెట్టాయి. ప్రచార సభల్లో షర్మిల ఆహర్యం, డైలాగ్ డెలవరీ ఓటర్లు ఇట్టే కట్టిపడేసేవి. అదే ఫ్లోలో గంపగుర్తుగా వైసీపీకి ఓట్లు పోల్ అయ్యేలా చేసేది. అది చూసిన ప్రతిఒక్కరూ .. అంతటి వాక్ చాతుర్యం తండ్రి రాజశేఖరరెడ్డి నుంచే షర్మిల పుణికిపుచ్చుకుంద ని అందరూ అంటుంటారు.

2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత.. ఎందుకో షర్మిల పార్టీకీ.., అన్నకు దూరమైంది. సొంతగా తెలంగాణలో పార్టీని పెట్టాలని నిర్ణయించుకున్నారు. వైఎస్ఆర్సీపీ అన్న జగన్ రెడ్డికి సంబంధించిన పార్టీగా ఏపీలో అధికారంలో ఉంటే.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా నామకరణం చేసి తెలంగాణ గడ్డకు పరిచయం చేసింది షర్మిల. పార్టీ స్ధాపించిన నాటి నుంచి బీఆర్ఎస్ ను, కాంగ్రెస్ ను ఏకిపారేసింది ఆమె. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ .. యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఫైట్ చేసింది.  

ఇదిలా ఉంటే తెలంగాణ లో జరిగే సాధారణ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ప్రకటించిన షర్మిల.. షడన్ గా కాంగ్రెన్ లో పార్టీని విలీనం చేసి.. కలిసి నడిచేందుకు సిద్దమయ్యారు. అయితే మారుతున్న రాజకీయ సమీకరణలు నేపధ్యంలో షర్మిల పెట్టిన డిమాండ్స్ కు కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోలేదు. దీంతో షర్మిల చాలా కాలం సైలెంట్ అయ్యారు. ఈ నేపధ్యంలో నిన్న షర్మిల మీడియా ముఖ్యంగా తన రాజకీయ ప్రయాణం, భవిష్యత్తుగా గురించి తేల్చి చెప్పేసింది.  ఈసారి తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎటువంటి కండీషన్స్ లేకుండా వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ గెలుపుకు పూర్తిగా తనవంతు మద్దతు అందజేస్తానని చెప్పారు షర్మిల. ఇదే రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ ను గద్దెదించేందుకే తాను కాంగ్రెస్ తో కలిసి పోరాడుతున్నట్లు షర్మిల చెప్పుకొచ్చారు.

అయితే షర్మిల నిర్ణయాన్ని కేడర్ లోని సీనియర్ కొందరు వ్యతిరేకించి బయటకెళ్ళిపోగా.. మరి కొందరు లోటస్ పాండ్ ఆమె ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేశారు. షర్మిల నిర్ణయాన్ని రాష్ట్రంలోని వైఎస్ఆర్ అభిమానులు, ఆమె పార్టీ నేతలు ఆహ్వానిస్తున్నారు. తెలంగాణను విముక్తికి కేసీఆర్ ను ఇంటికి సాగనంపాలని కాంగ్రెస్ పార్టీ తోపాటు షర్మిల బలంగా భావిస్తుంది కాబట్టే ఈ రకమైన పొత్తు ఆమెకు కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషణలు ఊపందుకున్నాయి.