రేపే ఢిల్లీకి షర్మిల.. పార్టీ విలీనం.. భారీ ఆఫరిచ్చిన కాంగ్రెస్..!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు షర్మిలకు కాంగ్రెస్ పార్టీ భారీ ఆఫర్ ఇచ్చింది.

షర్మిల ఎన్నాళ్ళ నుంచి వేచి చూస్తున్న సమయం రానే వచ్చింది. కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేయాలన్న ఆమె సంకల్పం నేటికి ఫలించింది. ఆమెకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. రేపు ఢిల్లీ వెళ్ళేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం రెండు బంపర్ ఆఫర్లును ప్రకటించింది.

పార్టీని విలీనం చేసిన అనంతరం కాంగ్రెస్ కండువాను కప్పి సోనియా షర్మిలను పార్టీలోకి ఆహ్వానిస్తారు. అనంతరం జాతీయ కాంగ్రెస్ కమిటీలో ఆమెకు పార్టీ జాతీయ జరనల్ సెక్రటరీ పదవి ఇవ్వనున్నారు. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్ ప్రకటన కూడా చేసింది. అలానే షర్మిల ఎప్పటి నుంచో పాలేరు సీటుపై ఆశలు పెట్టుకున్నారు. అది ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పిన కాంగ్రెస్.. ఖమ్మం పార్లమెంట్ బరిలో ఉంచుతామని హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఏఐసీసీ లో జనరల్ సెక్రటరీగా సోనియా కూతురు ప్రియాంకా గాంధీ కూడా కొనసాగుతున్నారు. ఆమెతో  సమానమైన ఈ హోదాను షర్మిలకు కేటాయిచండం గమనార్హం.

మరోవైపు తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అంది వచ్చిన అన్నీ అవకాశాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పొంగులేటి.., తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకున్న నేపథ్యంలో షర్మిలను పార్టీలోకి ఆహ్వానించి ఖమ్మం బరిలో దించేతే ఖమ్మంలో వార్ వన్ సైడ్ గా మారుతుందని అంచనాలు వేస్తోంది. మరో వైపు ఎన్నికలు దగ్గరపడేకొద్దీ బీఆర్ఎస్ ను బలహీనపరిచేందుకు ఎత్తుకు పై ఎత్తుతో కాంగ్రెస్ అడుగులు వేస్తోందనే చెప్పాలి.