కోర్టుల్లో వాయిదాల పరంపరం..! ఎందుకు..?

ఏపీలో దిగువ, ఎగువ కోర్టులులో ప్రాసుక్యూషన్ నిర్ణయాల మేరకు నడుచుకోవాలా..? అంటే అవుననే సమాధానాలు వినవస్తున్నాయి.

ఏపీ సీఐడీ, పోలీసు విభాగాలు నమోదు చేస్తున్న కేసులు కోర్టుల్లో నిలబడవు అని న్యాయమూర్తులకు సైతం  తెలుసు కానీ..బయటకు చెప్పుకోలేని.., ఒప్పుకోలేని పరిస్ధితి. గడిచిన నాలుగునరేళ్ళల్లో కేవలం తెలుగుదేశం పార్టీ నేతలపై, కార్యకర్తలపై జగన్ ప్రభుత్వం దాదాపు 60 వేలకు పైగా కేసులు నమోదు చేసింది. తెలుగుదేశం పార్టీ ప్రాధాన నేతలపై  పెట్టిన కేసుల్లో ఏ ఒక్కటి నిరూపితం చేసే సాక్ష్యాలను సంపాదించలేకపోయింది ఏపీ సీఐడీ. దీంతో కోర్టుల్లో విచారణ జాప్యం.., విలువైన సమయం వృధా వంటి ఆ నాలుగు గోడల మధ్య న్యాయమూర్తి ఎదుట తరుచు జరిగే తతంగమే.

బెస్ లెస్ అభియోగాలపై కేసులు నమోదు చేయడం, సాక్ష్యాలు సమర్పించడంలో జాప్యం చేయడం వంటివి జగన్ రెడ్డి ఇలకాలో ఎన్నో చూశాం. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులపై గతంలో.., ప్రస్తుతం  పెడుతున్న అవినీతి కేసుల్లో సీఐడీ అధికారులు ఏ అధారంతో అరెస్ట్ చేశారని న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు వారి వద్ద ఎటువంటి ఆన్సర్ రాదు. వీరు ఇలా ఉంటే.., ఎటువంటి సాక్ష్యాలు లేకుండానే బెస్ లెస్ ఆర్గిమెంట్స్ చేయడం ప్రాసుక్యూషన్ వారి వంతైంది. చెట్టుకింద ప్లీడర్ గా ఉన్నవారంతా.. ఎటువంటి సబ్జెట్ లేని న్యాయవాదాలను, పార్టీ అనుకూల, అందులో రెడ్డి సామాజీక వర్గాల వారికి ప్రాసుక్యూటర్ గా, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసుక్యూటర్ గా  పదవులిచ్చి.. న్యాయస్ధానాలపై తొలరన్నది సోషల్ మీడియా నిత్యం వినిపిస్తున్న వాదనే.

ఇదే తరహా.. చంద్రబాబుపై పెట్టిన స్కిల్ కేసులో బహిర్గతమవుతోంది. చేసిన నేరం నిరూపితం కావాలంటే సాక్ష్యం కావాలి. కానీ ఆ సాక్ష్యాలను సేకరించేందుకు సంవత్సరాలు పట్టినా..  అప్పటి వరకు ముద్దాయిగా ఉన్న ఆ ప్రజాప్రతినిధి, ఆ అధికారి, సామాన్య ప్రజలు సైతం అలా జైల్లో మగ్గాలా..? అన్నది ఏపీ వ్యాప్తంగా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కక్షపూరిత కుట్రలు పరాకాష్టకు చేరితే.. ఇలాంటి అక్రమ కేసులే రిపిట్ అవుతాయని ప్రజాస్వామ్యం ఎప్పుడో గుర్తించింది. నేడు   చంద్రబాబు న్యాయం కోసం కోర్టులో దాఖలు చేస్తున్న పిటిషన్లపై దిగువ, ఎగువ కోర్టుల్లో వాయిదా పరంపరలో అలానే టేబులుకే పరిమితం అవుతున్నాయి. శుక్రవారం బెయిల్ పిటిష్ పై ఏపీ హైకోర్టులో వాయిదా పడింది.అందుకు కారణం అధికారుల ఒంటెద్దుపోకడే.

ఏపీ హైకోర్టు బెయిల్ పిటిషన్ ను ఈ నెల 15 కు వాయిదా వేసింది. కారణం ఏమిటంటే.. ఈ పిటిషన్ విచారణకు అదనపు ఏజీ హాజరుకాకపోవడం.., మరింత సమయం కావాలని పీపీ కోరడం వంటివే. విచారణ కీలక సమయాల్లో వాయిదాలు అడగడం, లేకుంటే కోర్టులకు సెలవులు పెట్టడం ఏజీ, ఏఏజీ వంతుగా ఉంది. దీంతో కేసులు ఏళ్ళ తరబడి వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంటుంది. దీంతో చట్టాలు, న్యాయస్ధానాలు, న్యాయస్ధానాలలో షాడో టీంలపై ప్రజలకు బాగానే అవగాహన వచ్చింది. రాజ్యాంగబద్ధంగా స్వతంత్ర సంస్థలుగా వ్యవహరిస్తున్న న్యాయస్థానాలు ఏపీలో అబాసుపాలౌతున్నాయి. అంతిమంగా న్యాయం కనుచూపు మేరకు కనిపించనప్పుడు కత్తిపట్టడమే సరైనది సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూద్రా ట్విట్ ను ఏపీ ప్రజలు సమర్ధిస్తున్నారు.