ఎన్టీఆర్ ను వదలేశారా..? వదిలించుకున్నారా..?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను ఫ్యాన్స్ తోపాటు కొన్ని మీడియా చానెల్స్, డిజిటల్ మీడియా వేదికలు పట్టించుకోవడంలేదా..? అంటే అవుననే సమాధానాలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి.

అభిమానుల ఆదరణకు దూరమవుతున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. అన్న టైటిల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. తాత వారసత్వంతో జూనియర్ సినిమాలో అరంగేట్రం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత రాజకీయాల్లో చంద్రబాబు కలిసి చురుగ్గా పనిచేశారు. 2009 ఎన్నికల ప్రచారంలో తన తనదైన శైలిలో పార్టీ కోసం పనిచేశారు జూనియర్. అయితే రాజకీయాలు వేరు.., కుటుంబ బంధుత్వాలు వేరు అన్న కోణంలో జూనియర్ ఆలోచించలేకపోతున్నారని తెలుగుదేశం పార్టీ వర్గాలతో పాటు కమ్మ సామాజిక వర్గంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

స్కిల్ డెవలప్మెంట్ కేసులు చంద్రబాబు అనంతరం ఏపీ రాజకీయాలలో అనూహ్య మార్పులు సంభవించాయి చంద్రబాబుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారి నుంచి మద్దతు లభిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుంది. 2024 ఎన్నికల్లో పక్కగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఇందంతా ఒకవైపు అయితే 40 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ 40 రోజులు వ్యవధిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరోజు కూడా ఆయన మేనత్త భువనేశ్వరిని పరామర్శించ లేకపోయారు కనీసం సోషల్ మీడియా వేదిక కూడా ఆయన సంఘీభావం తెలపలేకపోయారు. ఇదే ఇప్పుడు జూనియర్ కెరియర్, ఆయన వ్యక్తిత్వం పైన మచ్చ పడేలా ఉంది అని అభిమానులు పెద్ద ఎత్తున విచారం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ మౌనం వెనుక అనేక కారణాలు ఉండవచ్చు.. కానీ బాహ్య ప్రపంచంలో అవి నెగిటివ్ టాక్ ను తెచ్చిపెడుతున్నాయి. ఇవే పరిణామాలు భవిష్యత్తులో ఆయన సినిమాలపై కూడా పడే అవకాశం లేకపోలేదు. జూనియర్ దాదాపు 80 శాతం తెలుగు దేశం పార్టీ అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం నడుస్తున్న పరిణామాల క్రమంలో చంద్రబాబు అరెస్ట్.., జూనియర్ ఎన్టీఆర్ స్పందనపైనే తెలుగుదేశం పార్టీ కేడర్, అభిమానులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అలా జరిగితే.. భవిష్యత్తులో జూనియర్ సినిమాలకు ఆధారణ తగ్గనున్నది. అలా జరిగితే ఏపీలో ఆయన సినిమాలు ఆడవు. నిర్మాతలకు సైతం భారీ నష్టాలను చవిచూడక తప్పదని విశ్లేషణలు లేకపోలేదు. కొన్ని వర్గాల వారైతే.. ఇకపై జూనియర్ సినిమాలను ఎంకరైజ్ చేసేదే లేదు అంటూ బహిరంగంగానే చెప్పుకుంటన్నారు.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా.., కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొన్ని చానల్స్ లో ఎన్టీఆర్ సినిమా అప్డేట్స్ ను చూపించడం మానేశారు. ఈ నెలరోజుల వ్యవధిలో ఎన్టీఆర్ కు సంబంధించిన ఏ అప్డేట్స్ ప్రసారం చేయట్లేదు కూడా. డిజిటల్ మాధ్యమాలలో ఎన్టీఆర్ బొమ్మను ఆయన సినిమా విశేషాలను ప్రచురించడం మానేశారు.

తాజాగా ఎన్టీఆర్ కు ఓరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్స్ న్యూ మెంబర్స్ క్లాస్ అఫ్ యాక్టర్స్ అంటూ ఐదుగురు నటుల పేరు ప్రకటించింది. అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఘనత జూనియర్ ఎన్టీఆర్ సాధించారని సోషల్ మీడియాలో ప్రశంసలు వెలువెత్తుతున్న క్రమంలో పార్టీ అనుబంధ సోషల్ మీడియాలోనూ, కొన్ని డిజిటల్ మాధ్యమాలలో, కమ్మ సామాజిక వర్గం చెందిన చానల్స్ లో ఈ వార్తలు ప్రచురించరితం కాకపోవడం విశేషం. ఎందుకో జూనియర్ వార్తలను ప్రచురించడంలో ఇష్టపడటం లేదు అన్న టాక్ ఉంది.

తెలంగాణలో మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇకపై జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడటం కష్టమేనని ఇప్పటికే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తేల్చేశారు. తాత చూపిన బాటలో సినిమా లో రాణిస్తున్న జూనియర్.. తెలుగుదేశం పార్టీ కూడా ఒక సామాజిక బాధ్యతగా ఎందుకు గుర్తించలేక పోతున్నారని వాదనలు లేకపోలేదు. కుటుంబాల మధ్య ఉండే పొరపాత్యాలను ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చూపటం సరికాదని విశ్లేషణలు ఉన్నాయి. దీంతో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలపై ఈ నెగటిక్ ట్రోల్స్ అన్ని విధాలుగా ప్రభావం చూపుతాయని వార్తలు వినిపిస్తున్నాయి.