తలసాని తల్లో తిరిగిన పురుగు..తిప్పింది దొరేగా..?

బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తల తిరిగి.. పాత ప్రేమాయణానన్ని కొత్తగా మొదలు పెట్టాడని ఈ రోజు సోషల్ మీడియా అంతా కోడై కూస్తోంది.

చంద్రశేఖర్ డ్రామా ట్రూప్ అంతా ప్రస్తుతానికి తెలుగుదేశ జపం పటిస్తున్నారు. జై ఎన్టీఆర్ అని బీఆర్ఎస్ నాయకత్వం అంటుంటే.. జై చంద్రబాబు.. ఆయనకు జరిగింది అన్యాయమని ఆపార్టీ మంత్రులు ఆర్టిఫిషియల్ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయమేనని బీఆర్ఎస్ పార్టీనీ.., ఆ మంత్రులను సోషల్ మీడియా వేదికగా తెలంగాణ తెలుగు దేశం అభిమానాలు  ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు.

తెలంగాణలో వేదిక ఏదైనా.. ఏ కార్యక్రమైనా.. ప్రాంతం ఎక్కడైన్నది కూడా చూడకుండా తెలుగు దేశం పార్టీ గురించి.. ఆ పార్టీ అధినేత.., మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్ గురించే మాట్లాడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్న రాజకీయం ఇదే. సంఘీభావం తెలుపుతూ.. బాబు అరెస్ట్ కు చాలా పీ(ఫీ)లై పోతున్నారంట. కానీ .. కేసీఆర్ అన్న కు తమ్ముడైన జగన్ నీచ రాజకీయాలను మాత్రం ఎండగట్టరంట. అదేం లెక్క దొర అంటూ బాగా వేసుకుంటున్నారు తెలంగాణ టీడీపీ అభిమానులు. చంద్రబాబు అరెస్ట్ లో చాలా బాధకరమని విచార వదనంతో అంటున్నారే కానీ.. జగన్ నికృష్ట, క్షక్ష్యసాధింపు అక్రమ అరెస్ట్ లను మాత్రం ఖండించరని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ చేస్తే ముందు సంతోషపడింది కేసీఆర్ అండ్ కో నే. తమ్ముడు మంచి పని చేశాడని ప్రగతి భవన్ నుంచి ఆశీస్సులు అందినవాడే ఈ డ్రామా రావు అండ్ కో. ఇది తెలంగాణలో అందరి నోట నుంచి వినబడుతున్న మాటే.  

కానీ.. డ్యామీట్ కథ అడ్డం తిరిగింది.. నష్టనివారణ గ్రహించిన కేసీఆర్ మంత్రులతో  మాట్లాడించడం మొదలుపెట్టాడు. కొడుకుతో ఆ మొన్న హైదరాబాద్ ఐటీ వాళ్ళు.. ఏపీ వెళ్లి చంద్రబాబు కోసం ర్యాలీలు.., నిరసన చేయాలని అనేలా టెస్ట్ కార్డ్ వాడారు. కానీ.. అనుకున్నదానికి బాగానే బెడిసికొట్టింది. గుక్కతిప్పుకున్న అబ్బా.. కొడుకులు.. ఖమ్మం బాట పట్టారు. అక్కడ తెలుగు దేశం పార్టీని పైకెత్తి.., ఎన్టీఆర్ కు మొక్కిండ్రు. రాజకీయ భిక్షపట్టి.. రెండు దఫాలుగా ఎమ్మెల్యేను చేసి చంద్రబాబును మరిచి.. నిద్ర నటించి.. చంద్రబాబు అరెస్టై పాతిక రోజులు తరువాత ఈ రోజు లేచారు. మేల్కొని..చూసే సరికి సనత్ నగర్ లో పెద్దబొక్క కనిపించింది. ఓడిపోతావ్ రా.. నాయనా అంటూ సర్వేలు మొత్తుకుంటే ఈ రోజు తప్పక మాట్లాడాడు తలసాని. బాబు అరెస్ట్ దారుణం.., అలా జరగడం అన్యాయం.. ఇలా జరిగి ఉండకూడదని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కు పసుపు పార్టీ బాగానే కౌంటర్ ఇచ్చింది.

సనత్ నగర్ లో తెలుగుదేశం పార్టీకి దాదాపు 35, 000 ఓటు బ్యాంకు పైగానే ఉంది. ఇది 2014 నుంచి 2019 వరకు ఉన్న లెక్క.. ఇప్పుడు ఇది కాస్తా పెగిరిన సెటిలర్స్ తో కలిపి 50 వేల అయ్యింది. అందుకే తలసాని చంద్రబాబుపై ప్రేమ ఉప్పొంగి ఆ డైలాగ్ వాడారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  చంద్రబాబు ఒక్క అరెస్ట్ .. దెబ్బకు రెండు పిట్టలు టా .. అన్నట్లు ఏపీ జగన్ .. తెలంగాణ లో కేసీఆర్ పని ఐపాయే అన్నట్లు రాజకీయం మారింది. గడిచిన 25 రోజులుగా తెలంగాణలోని టీడీపీ స్లిపర్ సెల్స్ మొత్తం యాక్టీవ్ అయ్యీ..  నిన్ను మేం కూడా నమ్మం దొర అంటూ టాగ్ చేస్తు సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ  అంతఇంత కాదు.