జగన్ సైకోయిజానికి తల్లడిల్లుతున్న జనం..!

ఏపీ సీఎం జగన్ రెడ్డి సైకోయిజానికి జనం తల్లడిల్లుపోతున్నారని తెలుగు దేశం పార్టీ అధినేత నారా లోకేష్ ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో దారితప్పిన రాజ్యాంగాన్ని గాడిలో పెట్టి కాపాడాలని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు తెలుగుదేశం నేతల బృందం విజ్ఞప్తి చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు,పీతల సుజాత, కొల్లు రవీంద్ర తదితరులు గవర్నర్ ను కలసి వినతిపత్రం సమర్పించారు. ప్రతిపక్షాలపై జగన్ చేస్తున్న కక్షసాధింపు రాజకీయాలు రాష్ట్రంలో హింసను ప్రేరిపించేలా ఉన్నాయని స్పష్టం చేశారు లోకేష్.

ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై దాడులు, కేసులు వంటివి సర్వసాధారణంగా మారాయన్నారు. జగన్ రెడ్డి ఏపీలో పాలన బాధ్యతలు తీసుకున్న నాటినుంచి దాదాపు తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై 60 వేల కేసులు పెట్టారు. ఇది అక్షర సత్యం. గతంలో ఎన్నడూ లేని పచ్చి నిజం. ప్రతిపక్షాలతో సంబంధాలు చెడకుండా వారి ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకుంటూ.. ప్రజలకు మంచి చేయలన్న దృక్పంధం జగన్ రెడ్డికి ఏ కోశాన లేదు. అందుకే ప్రతిపక్షాన్ని తొక్కిపట్టే రాజకీయాలు సాగిస్తూ.. మరోసారి ఏపీలో గద్దెనెక్కిందుకు కుట్రలు చేస్తున్నారు.

మరోవైపు రాష్ట్రంలో ప్రతిపక్షాలతోపాటు.., బడుగు బలహీన,అనగారిన వర్గాలపై నిత్యం దాడులు చేస్తూ.. వారిని మానసికంగా, శారీరకంగా హింసకు గురిచేస్తోంది అధికార వైసీపీ. దీనిపై కూడా సమగ్రంగా వివరిస్తూ.. లోకేష్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. జగన్ ప్రభుత్వాన్ని దించి.. ఈ ఐదు నెలలు రాష్ట్రపతి పాలనను విధించాలని కోరారు.