ఎన్నికల సంఘమా..? ప్రజాస్వామ్య పతనం చూడుమా..!

భారత ఎన్నికల సంఘం భ్రష్టిపట్టిపోతోందా..? సర్వతంత్ర సంస్థ సర్వాధికారాలను కోల్పొతుందా..? రాజకీయాలు ఆడే ఆటలో పావుగా మారుతుందా..? అంటే సర్వత్రా అవుననే సమాధానాలు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.

ప్రజాస్వామ్య పతనానికి ఎన్నికల కమిషనే కారణం అంటే ఒప్పుకుంటారా..? కానీ ఏపీలో అపహస్యమౌతున్న ఎన్నికల సంఘ తీరు చూస్తే ఎవరైనా ఒప్పుకోక తప్పదు.  హత్యలు, అక్రమాస్తులు, మాదక ద్రవ్యాల వ్యాపారాలు, ఎటువంటి చదువులేని నిశానుల సైతం  రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజాసామ్యాన్ని ఖూనీ చేస్తుంటే ఆ సంఘ విద్రోహాన్ని ఎవరు కట్టడి చేయాలంటే దేశంలో ఆన్సర్ ఉండదు. ప్రజాసేవకుడి ముసుగులో నేరాలు, అక్రమాలకు పాల్పడుతుంటే రాజ్యాంగబద్ధ సంస్థలు చెవులు,నోరు, కళ్లు మూసుకుంటే.. మేధావులు పెన్ కాదు.. గన్ పట్టుకోవాల్సిన అనివార్య పరిస్ధితి ఏర్పడ మానదని ఓ సామాజీకవేత్త నోటిమాట నిజంకాక మనాదు. ఇదే ప్రస్తుతం దేశంతోపాటు ఏపీ ప్రజలు నమ్మె నగ్న సత్యం.

ఏపీలో జరుగుతున్న విధ్వంసాలు, నకిలీ ఓట్లు.. ప్రజాస్వామ్య మూలస్తంభాలను కూల్చివేస్తుంటే.. నిలబెట్టాల్సిన రాజ్యాంగవేత్తలు దేనికీబద్ధులై ఉన్నారు..? అన్న ప్రశ్న అందరిలో తలత్తెక మానదు. బోగస్ ఓట్లతో తప్పుల తడకగా మారిన ఏపీ ఓట్ల జాబితాను సరిదిద్దాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిది. కానీ ఏపీలో ఈసీ మొద్దునిద్రను నటిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ప్రజా హక్కులను కాల రాయపడుతున్నా.. రాష్ట్రంలో  గవర్నర్ ఉండి ఏం ప్రయోజనం..? దేశం సరిహద్దుల్లో భద్రతే కాదు.., దేశంలోని సంఘ విద్రోహ రాజకీయ శక్తులను పీచం అణిగించాల్సిన పీఎం స్ధాయి వ్యక్తి నాటకం చూస్తూ మిన్నకుంటే ప్రజాసామ్యం ఏమై పోవాలి..? నేరస్తులు, నిశాని నేతలు ఓట్ల హక్కును వారి సొంత పార్టీలకు అనుకూలంగా మార్చివేస్తుంటే ఐదేళ్ళకొకసారి మేమున్నామని ఉనికిని చాటుకునే సర్వ స్వతంత్ర సంస్థ భారత ఎన్నికల సంఘం ఉదాసీనతను ప్రదర్శిస్తే హింస పెరగదా..? అని ఏపీ ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలు ఎవరు సమాధానం చెప్తారు..?

ఏపీలో నకిలీ ఓట్ల కలకలం రాష్ట్ర ఎన్నికల కమిషనే కాదు…, కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా బాధ్యత తీసుకోవాలి. కానీ.., అది జరుగుతోందా…? అంటే లేదనే చెప్పాలి. ఏ శక్తి వారికి అండగా లేకుంటే.. అంత ధైర్యంగా ప్రజా ఓటు హక్కులతో ఆటలు ఆడుతారా..? అన్న విమర్శలు ఏపీ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఏపీ ఎన్నికల ముసాయిదా తప్పులు తడకగా మార్చిన ఘనత అధికారపార్టీది అయితే.. అందులో ఎన్నికల కమీషన్ పై కూడా అనుమానాలు లేకపోలేదు.

ప్రజలు, విపక్షాలు మా ఓట్లు.., మా పార్టీ సానుభూతిపరుల ఓట్లను ఫాం-7 ద్వారా పెద్దఎత్తున నిబంధనలు విరుద్దంగా తొలగిస్తున్నారని గగ్గొలు పెడుతున్నా.. చెవిటి ముందు శంఖం మాదిరిగా నటిస్తుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ప్రతి నియోజకవర్గంలలో ఒకే డోర్ నెంబర్ పై నమోదు అవుతున్న  ఓట్లు.., సంబంధం లేని వ్యక్తుల పేర్లతో చిన్న దుకాణాల డోర్ నెంబర్లు,జీరో డోర్ నెంబర్ తో నమోదు అవుతున్న ఓట్లును వేలల్లో సాక్ష్యాలు చూపినా.. ఎన్నికల సంఘం మొండిగా వ్యవహరించడం నిజంగా హాస్యాస్పదమే.