చంద్రబాబుకు జైల్లో స్టెరాయిడ్స్ ప్రయోగం నిజమేనా..?

స్కిల్ డెవలప్మెంట్ కేసులో గత 36 రోజులుగా జైల్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.

తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు స్కిల్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. 36 రోజులుగా జైల్లో ఉన్న చంద్రబాబుకు గత నాలుగు రోజులుగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. కనీసం వసతుల్లేక తరుచు ఆయన అనారోగ్యం భారీన పడుతున్నారని కుటుంబం సభ్యులతోపాటు.., టీడీపీ సీనియర్ నాయకుల సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మొన్న తీవ్రమైనా డీ హైడ్రేషన్ భారీన పడ్డారని జైలు అధికారులు వైద్యులచే చికిత్స అందించారు. జైల్లో వాడుకంలో ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు సరైన క్లోరినేషన్ లేక నీరు కలుషితం అవుతున్నాయని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆరోపిస్తున్నారు. తద్వారా ఆయనకు వంటిపై దద్దుర్లు వస్తున్నాయని ఆమె వాపోయ్యారు. వీటన్నీంటికి తోడు ఆయన 5 కేజీలు బరువు తగ్గారని.., మరో 2 కేజీలు తగ్గితే ఆయన కిడ్నీలకు ప్రమాదం ఉందని భువనేశ్వరి అవేదన వ్యక్తం చేసింది. మరోవైపు ఆయనకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన కామెంట్స్ చేశారు.

జైల్లో చంద్రబాబుకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారని లోకేష్ ఆరోపిస్తున్నారు. చంద్రబాబుకు వైద్యం చేయిస్తున్న మెడికల్ ప్రిస్ర్కిప్షన్ ను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఎప్పటి నుంచో వైద్యం అందిస్తున్న వైద్యుల సలహాలు తీసుకోకుండా ఇష్టరాజ్యంగా ఆయనకు చికిత్స అందిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని వాపోయ్యారు లోకేష్. చంద్రబాబుకు ఏమైన జరిగితే పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

మరోవైపు పార్టీ శ్రేణులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును పధకం ప్రకారం అరెస్ట్ చేసి..జైలు నాలుగు గోడల మధ్య హత్య చేయాలని చూస్తున్నారని.. అలా జరిగితే జగన్ రెడ్డి ప్రభుత్వమే ఇందుకు బాధ్యత వహించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.