టీడీపీ వినూత్న నిరసనలు.. వర్కౌట్ అవుతాయా..?

స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు ఏపీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారి నుంచి మద్దతు లభిస్తోంది. కానీ ఎంత వరకు వర్కౌట్ అవుతోంది..? అన్నదే ప్రశ్న.

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ 50 రోజులు దాటింది. జ్యుడిషియల్ కస్టడీలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును విడుదల చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి.., అడ్డగోలుగా జైలు గోడలు మధ్య చంద్రబాబును బంధించారని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తెలుగు దేశంకు పెద్ద దెబ్బే. కానీ.., ఆయనను కేసుల నుంచి బయటపడేసేందుకు పార్టీ అన్నీ దారులను వెతుకుతోంది. సీనియర్ న్యాయవాదులు సైతం ఆయనను ఈ కేసుల నుంచి బటయపడేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. స్కిల్ కేసులో గతంలో కూడా అరెస్ట్ అయిన వారికి 30 రోజులకే బెయిల్ వచ్చింది. కానీ.., చంద్రబాబు పరిస్ధితి అందుకు భిన్నంగా ఉంది. బెయిల్ పిటిషన్లు కోర్టుల్లో వాయిదాల పర్వం నడుస్తోంది. అది ఎంత కాలంమో అర్థం కానీ స్ధితి. క్వాష్ పిటిషన్ పై సుప్రీంలో వాదనలు పూర్తి అయ్యాయి. దసరా శెలవులు ముగిసి..,  సోమవారం తిరిగి సుప్రీం తలుపులు తెరచుకోనున్నాయి.

ఈ క్రమంలలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. మరోవైపు హైకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ పై వాదనలు జరగనున్నాయి. ఇంకోవైపు జైల్లో చంద్రబాబు అరోగ్య పరిస్ధితి రోజురోజుకు క్షీణిస్తోంది. ఆయన ఆరోగ్యం దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని గత నెల రోజులుగా ఏసీబీ, హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో తెలుగు దేశం పార్టీ న్యాయవాధులు వాదిస్తున్నారు.  మరోవైపు పార్టీ శ్రేణులు మోత మోగిద్దాం, కాంతితో క్రాంతి, జగనాసుర దహనం, చేతికి సంకేళ్ళు, కళ్ళకు గంతలు అంటూ వినూత్న నిరసనలు శ్రీకారం చుట్టారు.

ఈ నేపధ్యంలో వారాంతలో ఇటువంటి కార్యక్రమాలు చేసి..మమ అనిపించుకుంటున్నారని.., ఆందోళనను ఉధృతం చేసే ప్రక్రియపై పార్టీ నేతలు, కార్యకర్తలు దృష్టి సారించకపోవడం విడ్డూరమని వార్తలు వైరల్ అవుతున్నాయి.  వైసీపీ అకృత్యాలను ఎండగట్టి.., చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని పార్టీ పిలుపుకు శ్రేణులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ఆ తరువాత ఆ విషయాన్ని పట్టించుకుంటున్న దాఖలాలు లేవు అన్నది వాస్తవం. పకడ్బంది ప్రాణాళికలతో నిరంతరం ఆందోళణ కార్యక్రమాలు, ఉద్యమాలు చేస్తేనే దాని తీవ్రత, వేడి రాష్ట్రం తోపాటు కేంద్ర ప్రభుత్వానికి సైతం తెలిసొస్తోంది.

అయితే.. వివిధ రూపాల్లో చేస్తున్న నిరసన కార్యక్రమాలకు పార్టీ శ్రేణులతోపాటు, సాధరణ ప్రజల  నుంచి సైతం ఇప్పటికీ స్పందన రావడం విశేషమే.