న్యాయస్థానాల్లో ఉత్కంఠ..నేతల్లో కలవరం..!

ఏపీలో ఎన్నికల సమీస్తున్న వేళ.. తెలుగు దేశం పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నాయన్నది సుస్పష్టం.

స్కిల్ కేసులో చంద్రాబాబు అరెస్ట్ తో 32 రోజులుగా టీడీపీ నిరసన బాట పట్టింది. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు.., అధిష్టానం బాబును ఎలా బయటకు తీసుకురావాలనే కోణంలో కరసత్తు చేస్తుంటే.. మరోవైపు ఏపీ సీఎం జగన్ .. తన పార్టీ శ్రేణులను వ్యూహాత్మకంగా ముందుకు కదుపుతున్నారు. ఈక్రమంలోనే విజయవాడ కేంద్రంగా నిర్వహించిన సార్వత్రిక సమరభేరి కార్యక్రమం విజయవంతమైంది.  పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని రగిలించేందుకు సీఎం జగన్ చేసిన ప్రసంగం కార్యక్రమంలో హైలెట్ గా నిలించింది.ఇంకోవైపు శ్రేణులను సన్నద్ధపరచడానికి వచ్చే  ఏడాది జనవరి వరకు కార్యక్రమాలను డిజైన్ చేసి.. జనాల్లోనే ఉండాలని ఆదేశించారు.

చంద్రబాబు అరెస్ట్ తో ఫుల్ జ్యోష్ లో ఉన్న జగన్.. 2024 లో గెలుపే లక్ష్యంగా ముందుకు దూసుకున్నారు. ప్రచారం విషయంలో వైసీపీ వ్యూహాత్మంకగా అడుగులు వేస్తుంటే.. ఇంకోవైపు చంద్రబాబు ఎప్పుడు బయటకొస్తాడు..? ఎలా తీసుకురావాలి..? అసలు వస్తాడా..? అన్న కోణాల్లో టీడీపీ అధిష్టానం.., శ్రేణులు ఉన్నాయి. న్యాయస్థానాల్లో ఇప్పటికే ఆయన వేసిన పిటిషన్లు కొట్టేసింది. నిన్న ఏసీబీ కోర్టులో కూడా మూడు రోజుల సుదీర్ఘ వాదనలు అనంతరం.. చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. హై కోర్టు కూడా స్కిల్ తోపాటు వివిధ కేసుల్లో బెయిల్ నిరాకరించింది. ఈ క్రమంలో టీడీపీ సుప్రీం మీదనే ఆశలు పెట్టుకుంది.

సోమవారం సుప్రీం ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరుఫున హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. దాదాపు 3 గంటల పాటు సాల్వే వాదనలు వినింపించగా.. సీఐడీ తరుఫున న్యాయవాది ముకుల్ రోహాత్గీ మంగళవారం తన వాదనలు వినిపిస్తానని కోర్టు అనుమతి తీసుకున్నారు. సాల్వే వాదనల నిశితంగా విన్న ద్విసభ్య ధర్మాసనం విచారణలోని మెరిట్స్ ను నమోదు చేసికుని మంగళవారానికి వాయిదా వేసింది. ఈ రోజు సీఐడీ తరుఫున వాదనలు విన్న తరువాత ధర్మాసనం ఇచ్చే తీర్పే కీలకంగా మారునున్నది. ఇప్పటికే ఏసీబీ.., హైకోర్టులో చంద్రబాబు వేసిన పిటిషన్లు ను కొట్టేశాయి. మొత్తంగా నేడు సుప్రీం ఇచ్చే తీర్పును బేస్ చేసుకుని తెలుగు దేశం భవిష్యత్తు కార్యచరణ ముడిపడి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.