రాజమహేంద్రవరంలో టీడీపీ, జనసేన రాజసం..!

రాజమండ్రి వేదికగా టీడీపీ,జనసేన పార్టీల మధ్య పొడిచి పోత్తులు.. ఇరు పార్టీల పటిష్టానికి విజయదశమి నాడు విత్తులు నాటారు అధినేతలు.

స్కిల్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును పరామర్శించిన జనసేనాని పవన్ రాజమండ్రి సెంట్రల్ జైలు బయట టీడీపీతో కలిసి పోరాడతాం.., పొత్తుపై కలిసి ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఐక్య కార్యాచరణకు సంబంధించి.. రూట్ మ్యాప్ ను ఇరు పార్టీలు రాజమండ్రి వేదికగా మరోసారి చర్చించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ అధ్యక్షత వహించారు. ఇరు పార్టీలకు సంబంధించిన పెద్ద సంఖ్యలో సీనియర్ నాయకులు హాజరైయ్యారు.   సమన్వయ కమిటీ భేటీలో దాదాపు మూడు గంటలు పాటు చర్చించుకున్నారు.

ఉమ్మడి మేనిఫెస్టో తో పాటు ఉమ్మడి కార్యచరణపైనే ప్రధానంగా చర్చించుకున్నారు. వీటిపై సమాలోచనలు చేసి.. మీడియా ముందుకు వచ్చిన పవన్, లోకేష్ లు భవిష్యత్తు కార్యాచరణను వివరించారు. సాగు నీటి ప్రాజెక్టల నిర్లక్ష్యం, ఉద్యోగ, ఉపాధి, పెరుగుతున్న ధరలపై చిత్తశుద్ధి లేకపోవడం వంటి వాటిపై ప్రభుత్వంతో ఉమ్మడిగా పోరాడాలని తీర్మానించించారు. మూడు రోజులు పాటు ఈ సమావేశాలు నిర్వహించి.. రాబోయే 100 రోజుల కార్యాచరణపై చర్చిస్తారు. అనంతరం నవంబర్ 1న ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించి.. టీడీపీ,జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు జైలుకు కూతవేటు దూరంలో ఈ సమావేశం నిర్వహించారు.

 ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు టీడీపీ, జనసేన వేస్తున్న ఉమ్మడి అడుగులు వేస్తున్నాయి. ఏపీ మేలుకై తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని ఇరు పార్టీ నేతలు సమన్వయంతో ముందుకు తీసుకుపోవాలని పవన్ కోరారు. మొత్తంగా టీడీపీ, జనసేన పొత్తు నిర్ణయం అధికార పార్టీని కొంతమేరుకు కలవపెడుతున్నా.. సంక్షేమమే మరోసారి తమకు  పట్టం కడుతోందని ధీమాతో వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తోంది.