చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ గ్రౌండ్ వెల్కామ్..!

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుకు తెలంగాణ తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్ లో ఘనంగా స్వాగతం పలికారు.

స్కిల్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు 52 రోజులు తరువాత మంగళవారం ఉదయం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.  ఈ నేపధ్యంలో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ క్రమంలో చంద్రబాబును చూసేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని ఘన స్వాగతం పలికారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు నేరుగా రోడ్డు మార్గంలో ఉండవల్లి నివాసానికి బయలుదేరారు. ఈ క్రమంలో రాజమండ్రి నుంచి విజయవాడ వరకు చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమైన చంద్రబాబు ప్రయాణం.. పార్టీ కార్యకర్తలు.., అభిమానుల నడుమ రాత్రంతా సాగింది. ఉదయం 5 గంటలకు ప్రాంతంలో ఉండవల్లి చేరుకున్న చంద్రబాబుకు కుటుంబ  సభ్యులు సాధారంగా  ఆహ్వానించారు. అనంతరం నివాసంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ నేపధ్యంలో చంద్రబాబు ఆరోగ్య పరిస్ధితి విషమించడంతో అత్యవసరంగా వైద్య చికిత్స తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. వైద్యులు సలహా మేరకు చంద్రబాబు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంకు చేరుకున్నారు. బేగంపేట నుంచి రోడ్డు మార్గంలో జూబ్లిహిల్స్ లోని తన నివాసానికి బయలుదేరాడు. బేగంపేట విమానాశ్రయం నుంచి జై బాబు.. జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేస్తూ కాన్వాయ్ ముందుకు సాగించి.  పంజాగుంట, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, జూబ్లి చెక్ పోస్ట్ మీదిగా చంద్రబాబు కాన్వాయ్ కదిలింది. అడుగడుగునా చంద్రబాబుకు తెలంగాణ తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు నీరాజనాలు పలికారు. కాన్వాయ్ ప్రయాణించిన రోడ్లన్నీ పసుపు పూలతో నింపి గ్రౌండ్ వెల్కామ్ పలికారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున చంద్రబాబుకు స్వాగతం పలికారు. పెద్ద పూలు చల్లి.., బాణాసంచా కాల్చి అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో బేగంపేట, పంజాగుట్ట, జూబ్లీహిల్స్  రోడ్లన్నీ జనసంద్రోహంతో నిండుకుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నడుమ 52 రోజులు జైలు జీవితం ముగించుకుని వస్తున్న చంద్రబాబుకు తెలంగాణ తెలుగుదేశం కేడర్ ఊహించని రీతిలో స్వాగతం పలికారనే చెప్పాలి.