టిడ్కో పేరుతో టొకరా..లబ్ధిదారులు గబారా..?

విన్నాను.. ఉన్నాను .. అన్నొస్తున్నాడు అన్నీ ఇస్తాడు అని చెప్పి.. గద్దెనెక్కిన జగన్ నేడు నమ్మిన ఓట్లేసిన ప్రజలకు నరకం చూపుతున్నాడు.

కేంద్రంలో ఆరు దశాబ్ధాల కాంగ్రెస్.., ఆ తరువాత కాంగ్రెసేతర ప్రభుత్వాలనై.. పేదవాడికి కూడు.., గూడుకు అధిక ప్రధాన్యత ఇవ్వడం చూశాం. ఎన్ని స్కాంలు చేసినా..  వాటికి మాత్రం ఏనాడు లోటు చేయలేదు. ఎన్డీఏ హయంలో కూడా ఈ దశాబ్ధకాలంలో ఏ రాష్ట్రాల్లోఇటువంటి పరిస్థితి మచ్చుకైనా కనిపించడంలేదు.  ఈశాన్యంలోని చిన్న రాష్ట్రాలు సైతం ఈ నాలుగేళ్ళల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన్ పథకం కింద ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు గూడు కల్పించింది. కానీ దార్శినికతకు అర్థం తెలియని జగన్ రెడ్డి ప్రభుత్వం.. దాన్ని మరించింది. జగనన్న ఇళ్ళు అని కేంద్రం ఇచ్చే నిధులను దుర్వినియోగం చేసింది. గత తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ హయంలో 2014 నుంచి 2019 దాదాపు 7 లక్షల టిడ్కో ఇళ్ళను మంజూరు చేసింది. అవన్నీ వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. వీటిని జగన్ ప్రభుత్వం వచ్చకా.. సకాలంలో సరైన మార్గంలో ప్రజలకు అందజేశారా..? అంటే అది కూడా లేదనే చెప్పాలి.  

జగన్ నమ్ముకుని సంతకాలు చేసిన పాపానికి టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులు నేడు బ్యాంకుల్లో మొండి బాకాయిదారులుగా నిలబడాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం మొదటి దఫాగా 2 లక్షల 62 వేల  టిడ్కో గృహాలను నిర్మాణం చేపట్టింది.  వీటి నిర్మాణాలకు టిడ్కో బ్యాంకుల వద్ద రుణం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 65 వేల మంది లబ్ధిదారులకు  బ్యాంకులు రుణాలను మంజూరు చేసినట్లు తెలుస్తోంది. కోట్లలో రుణాలు తీసుకున్న టిడ్కో.. గృహాలను మాత్రం పూర్తి చేయలేకపోయింది. నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధాదాలకు ఇస్తే.. తీసుకున్న రుణాలకు వాయిదాలు చెల్లించి ఉండేవారేమో. కానీ అదేం జరగలేదు.  దీంతో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 65 మందికి బ్యాంకులు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. మొన్న పాలకొల్లు నియోజకవర్గంలో కూడా ఓ బ్యాంకు టిడ్కో గృహాల లబ్ధిదారులకు నోటిసులు జారీ చేసింది. ఇనిస్టాల్మెంట్ కట్టకుంటే మీ గృహాలను వేలం వేస్తామని నోటీసులో పేర్కొనడంపై లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఆశలతో.. జగన్ రెడ్డి నమ్మి.. రుణ పత్రాలపై సంతకం పెట్టిన పాపానికి బ్యాంకు నోటీసులు అందుకోవాల్సి వస్తోందిని అవేదన వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు.

 ప్రభుత్వం అందజేస్తనన్న సమయానికి ఇళ్ళ నిర్మాణాలు కాక.., లబ్ధిదారులు వాటిల్లో  గృహప్రవేశాలు చేయకమునుపే ఇలా వాయిదాలు చెల్లించాల్సిన ఒత్తిడి తీసుకురావడం ఎట్టిపరిస్ధితుల్లో ఒప్పుకునేదే లేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ళను ఇంకా హ్యాండవర్ చేయపోగా.. ఇప్పుడు బ్యాంకు ద్వారా నోటీసులు పంపడం ఏమిటి..? అని నిలదీస్తున్నారు. మేము టిడ్కో ఇళ్ళల్లో ఉంటూ.. ఇనిస్టాల్మెంట్ కట్టకుంటే మా ఇళ్ళను జప్తు చేయాలే కానీ.., అసలు మా పేర్లతో ప్రభుత్వం రుణం తీసుకుంటే మాకు నోటీసులు పంపడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ళను పూర్తి చేసి.., ఇస్తేనే మేము బ్యాంకు ఇనిస్టాల్మెంట్ కడుతామని.., అలా కాకుంటే జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని..,  టిడ్కో అధికారులను వెళ్లి వాయిదాలు కట్టమని అడగండి అని రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు తిరగబడుతున్నారు.