రవితేజ కేరియర్ లో మరో మైలురాయి ‘టైగర్ నాగేశ్వరరావు’..!
మాస్ మహారాజ్ గా సిల్వర్ స్ర్కిన్ పై గుర్తింపు తెచ్చుకున్న రవితేజ కేరియర్ లో ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

మాస్ మహారాజ్ రవితేజ, నుపుర్ సనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిరా లేటెస్ట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ పాన్ ఇండియా లెవెల్ లో ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం థియేటర్లో రిలీజ్ అయింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి టాక్ ను తెచ్చుకుంది. మంచి పాజిటివ్ టాక్ వస్తుందని అమెరికాలో ఈ చిత్రం చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదిక విశేషాలను పంచుకుంటున్నారు.

స్టువర్ట్ పురం నాగేశ్వరావు జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైంది. రవితేజ కెరియర్ లో తొలి పాన్ ఇండియా చిత్రం కూడా ఇదే. సినిమాలో ఫస్ట్ ఫైట్ సీన్.., హీరో ఇంట్రడక్షన్ మామూలుగా లేదని నెటిజన్లు అంటున్నారు. ముఖ్యంగా ట్రైన్ సీక్వెన్స్ బాగుందని ఫాన్స్ అంటున్నారు. ఇంటర్వెల్ సీన్ రవితేజ స్క్రీన్ ప్రజెంటేషన్ కూడా ఆకట్టుకుద్దని.., సినిమాలో ఫైట్స్, జీవి ప్రకాష్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉందని కామెంట్స్ వస్తున్నాయి. చిత్రంలో రవితేజ సరసన నిపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్, అనుకృతి వాస్ నటించారు. సీనియర్ నటి రేణు దేశాయి, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, నాజర్, జిషు సేన్ గుప్త, హరీశ్ పేరడి, సుదేవ్ నాయక్ లు కీలక పాత్ర పోషించారు. యాక్టింగ్ లుక్ ఇలా అన్ని అంశాల్లో రవితేజ చాలా కొత్తగా కనిపించారు.

ముఖ్యంగా చిత్రంలో సెంటిమెంట్ ను దర్శకుడు వంశీ బాగానే పండించారు. సినిమా చూసిన ప్రేక్షకుడు గుడ్ ఫీల్ బయటకువస్తారని అభిమానులు గ్యారెంటీ ఇస్తున్నారు. యాక్షన్ అండ్ ఎమోషన్స్ ను కలగొల్పి నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు అన్ని విధాలుగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడని తెలుస్తోంది. ఎటువంటి బ్యాడ్ టాక్ లేకుండా చిత్రం రవితేజ కేరియర్ లో బ్లాక్ బ్లాస్టర్ గా నిలవడం ఖాయమన్నట్లు ప్రేక్షకులకు నుంచి పాజిటివ్ టాక్స్ వస్తున్నాయి. విజయ దశమి బరిలో.., అది నట సింహం బాలయ్య బ్లాక్ బ్లాస్టర్ మూవీ ‘భగవంత్ కేసరి’ రేసులో విడుదలైన ‘టైగర్ నాగేశ్వరరావు’ కూడా విజయం సాధించింనందుకు అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.