బాలయ్య హ్యాట్రిక్ హిట్.. భగవంత్ కేసరి బ్లాక్ బ్లాస్టర్..!

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి  ఈ ఏడాదికి బ్లాక్ బ్లాస్టర్ గా నిలించిందని అభిమానులు థియేటర్ల వద్ద పండుగ చేసుకుంటున్నారు.

అనిల్ రావిపూడి దర్వకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ హీరోగా నటించగా అందాల భామ కాజల్ అగర్వాల్, గ్లామర్ క్వీన్ శ్రీలీల, బాటీవుడ్ నటుడు అర్జన్ రాంపాల్ ప్రతి నాయకుడిగా మెప్పించారు. చిత్రంలో బాలయ్య డైలాగ్స్, యాక్షన్, ఎమోషనల్ సీన్స్ తో ధియేటర్లన్నీ దద్దరిల్లుతున్నాయి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి నేర్పించాలనే మేసేజ్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా బాగా కనెక్ట్ అయ్యేలా సినిమా ఉందని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఫస్ట్ హాప్ అంతా కామిడి సన్నివేశాలు..,కుటుంబ నేపధ్యంతో సాగితే.. సెకండ్ ఆఫ్ బ్యాంగ్ అదిరిపోయిందని అభిమానులు అంటున్నారు. యాక్షన్ సీన్స్ నెక్ట్స్ లెవల్ లో ఉన్నాయంట. సెకండ్ ఆప్ అంతా ఎమోషనల్ మాస్ ఎంటర్ టైనర్ గా నిలుస్తోందని చెబుతున్నారు. శ్రీలీల యాక్టింగ్ సినిమాలో హైలెట్స్ గా నిలిచినట్లు తెలుస్తోంది. స్కిన్ పై శ్రీలీల, బాలయ్య ఇద్దరూ నిజమైన తండ్రీకూతురు అనే ఫీలింగ్ ను కలిగించే పాత్రలో అలా ఇమిడిపోయారంట. ప్రతి ఆడబిడ్డ తల్లిదండ్రులతో కలిసి చూడాల్సిన చిత్రం భగవంత్ కేసరి అని రివ్యూలు ఇప్పటికే ఇస్తున్నారు.

బాలయ్య విజయదశమి పర్వదినాల్లో విజయాన్ని అందుకున్నారు. భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టేశాడు అంటూ థియేటర్ల వద్ద అభిమానులు కోలహలంగా ఆడి..,  చిందేస్తున్నారు. బాలయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి.. పాలభిషేకం నిర్వహిస్తున్నారు.   మొత్తంగా అభిమానుల అంచనాలకు అందేలా చిత్రాన్ని కూర్చి బాలయ్యకు భారీ విజయాన్ని అందించిన అనిల్ రావిపూడికి.., షైన్ బ్యానర్ అధినేత గారపాటి సాహు, హారీష్ పెద్ది లకు అభినందనలు తెలియజేస్తున్నారు.