ఏం.. బాలరాజు ఎందుకిలా ..? నీకే అలా….?

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడేకొద్ది.. వాడీవేడి రాజకీయాలు విమర్శలతో ఆగకుండా.. దాడులకు సైతం పురికొల్పుతున్నాయి.

తెలంగాణ ఎన్నికలు  ప్రధానంగా రెండు రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే గట్టిపోటీతో సాగుతున్నాయి. నియోజకవర్గాల్లో ఇరు పక్షాలు మాటలతో కాకుండా దాడులకు సైతం దిగుతూ.. హింసా రాజకీయాలకు తెరతీస్తున్నారు. అసలేందుకు ఇలా జరుగుతోంది..? గతంలో ఎన్నడూ లేనివిధంగా కేడర్ తోపాటు ఎమ్మెల్యేలు.., ఎంపీలపై ఎందుకు దాడులు జరుగుతున్నాయి..? అంటే విమర్శలు శృతిమించి పాకాన పడినందుకే ఇలా దాడులు.., ప్రతి దాడులు జరుగుతున్నాయని లెక్కలు వేస్తున్నారు.

మొన్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై దుండగుడు కత్తితో దాడి చేసి గాయపరిచారు. నిన్న రాత్రి అచ్చంపేట నియోజకవర్గం రూలింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై రాళ్ళ దాడి జరిగింది.  ఈ దాడుల్లో బాలరాజుకు గాయలయ్యాయి. అధికారపార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలనే టార్గెట్ చేస్తూ ఇలా దాడులకు తెగబడితే సామాన్య కార్యకర్తలు, ప్రజల పరిస్ధితి ఏంటి..? అని తెలంగాణ గడ్డపై పశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ప్రచారంలో ఉండగా ఎంపీపై దాడి చేసిన వ్యక్తి కాంగ్రెస్ కార్యకర్త అని బీఆర్ఎస్ ఆరోపించగా.. కాదు కావాలనే మీరే దాడులు చేయించుకుని ఇలా మాపై నిందలు మోపుతున్నారని బీఆర్ఎస్ వ్యాఖ్యలను తిప్పికొట్టింది కాంగ్రెస్. అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతోపాటు.. బీఆర్ఎస్ కార్యకర్తలపై కొందరు రాళ్ళ దాడి చేసి గాయపరిచారు. ఎమ్మెల్యే వాహనంలో డబ్బులు తరలిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తూ కొందరూ దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడిలో గాయపడ్డ గువ్వలకు హైదరాబాద్ అపోలో ఆసుపత్రి చికిత్స అందించారు. తనను అంతమొందించేందుకే ఇలా దాడి చేశారని గువ్వల బాలరాజు ఆరోపించారు. ఈ దాడి వెనక ఎవ్వరున్నా.. వదిలే ప్రసక్తిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఈ నేపధ్యంలో అచ్చంపేట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికల వేళ.. శాంతి భద్రతలు అదుపుతున్నాయి. నిఘా వ్యవస్థ నీడలో జరిగే ఎన్నికలు ఎక్కడో తేడా కోడుతుందని ఈ దాడులనుబట్టి చూస్తే ఇట్టే అర్థమవుతోంది. మొత్తంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా సాగే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను ప్రజలు కోరుతున్నారు.