కాంగ్రెస్ గూటికి వివేక్ వెంకటస్వామి..! పరాకాష్టకు రాజకీయాలు..!

తెలంగాణలో సాధారణ ఎన్నికల వేళ.. రాజకీయాలు అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

తెలంగాణలో సాధారణ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30 న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఈ నేపధ్యంలో అధికార బీఆర్ఎస్ నుంచి వలస పర్వ కొనసాగుతుంటే.. అంతకు మించి కాంగ్రెస్, బీజేపిల నుంచి బీఆర్ఎస్ లోకి వలసలు వస్తున్నారు నేతలు. టికెట్ దక్కకుంటే కండువా మార్చుడే అంటూ ఎమ్మెల్యేలు.., మాజీ ఎమ్మెల్యేలు.., పార్టీ సీనియర్లు సైతం కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో గత నెల రోజులుగా నేతల జంపింగ్ జపాంగ్ స్టంట్లు అందరూ చూస్తున్నాదే.

ఈ నేపధ్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు.., మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి కాంగ్రెస్ లో జంప్ అయ్యాడు. ఢీల్లీ వెళ్లి రాహుల్ సమక్షంలో వివేక్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. తన కుమారుడికి చెన్నూరు టికెట్ ఇస్తానని హామీ మేరకే వివేక కండువా మార్చినట్లు సమాచారం. అయితే వివేక కండువాలు మార్చడం.., టికెట్ ఇవ్వకుంటే పార్టీలకు గుడ్ బై చెప్పడం మామూలే. దశాబ్ధకాలంగా ఆయన చేస్తున్న నిలకడలేని రాజకీయాలు.. తనకంటూ కనీస కేడర్ ను కూడా సంపాదించుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శలు లేకపోలేదు.

2009 లో కాంగ్రెస్ ఎంపిగా పెద్దపల్లి నుంచి గెలిపొందిన వివేక్.. ఆ తరువాత బీఆర్ఎస్ .., తిరిగి కాంగ్రెస్.., ఆ తరువాత తిరిగి మరోసారి బీఆర్ఎస్ .., మొన్నటి వరకు  బీజేపీలో కొనసాగారు. టికెట్ ఇవ్వకుంటే పార్టీ కండువా మార్చుడే పనిగా పెట్టుకుని కనీసం విలువలేని రాజకీయాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి అని వివేక్ పై పొలిటికల్ సర్కిల్ మంచి పేరే ఉంది. అయితే కాంగ్రెస్ గూటిలో కూడా పొసిగినంత వరకే ఉంటారు.. ఆయనకు తిక్కరేగితే ఏ క్షణంలో ఏ పార్టీలో ఉంటారో.., ఎప్పుడు కండువా మారుస్తారో సొంతవారికే తెల్వదంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.