జగన్ కోసంబలిపీఠంపై ప్రభుత్వాధికారులు.. జైల్లో శేష జీవితం..!

ఏపీలో జగన్ రెడ్డి పాలనలో వింతలు.. విశేషాలు తరుచూ చూస్తున్నదే.. వింటున్నదే. ఈ మధ్య పార్టీ నేతలు కార్యక్రమాల్లో విముఖత చూపడంతో అధికారులతో ఆ పని చేయించడం ఆనవాయితీగా మారింది.

ఏపీలో ప్రస్తుతం ‘జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎందుకు కావాలో’ వివరించే కార్యక్రమం జరుగుతోంది. ఇందులో పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రభుత్వం అధికారుల కూడా భాగస్వామ్యం కావాలని తాడేపల్లి ప్యాలెస్ హుకూం జారీ చేసింది. వీళ్ళ సొమ్ము ఏం పోయింది… ఎన్నైనా ఆదేశాలు జారీ చేస్తారు.. ఆ తరువాత జైల్లోకి వీళ్ళతోపాటు పోయే వారి లెక్కల సంఖ్య రోజు రోజుకు పెరిగి ఇప్పటికే వందలు దాటుతోంది. అది పక్కన పెడితే.. తాజాగా ప్రారంభించిన ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో అధికారులను భాగస్వామ్యులను చేస్తూ డైరెక్షన్లు పంపింది తాడేపల్లి ప్యాలెస్. దీంతో సచివాలయం ముందు అధికారులు ఓవరాక్షన్ షురు అయ్యింది.

ఇంటింటికీ తిరిగి ‘ఏపీకి జగనే ముఖ్యమంత్రిగా ఎందుకో’ అన్న కార్యక్రమాన్ని వైసీపీ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ఇందులో భాగసామ్యులు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది అధికారికంగానా..? అనాధికారికంగానా..? అన్నది  పక్కన పెడితే.. సచివాలయాల ముందు ఉన్న జెండా పోల్ కు వైసీపీ జెండాను ఎగరవేసి..మరి సిబ్బంది స్వామి భక్తి చూపుతున్నారు. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ కార్యాలయాల ముందు పార్టీ కార్యక్రమాలను చేపట్టకూడదు. కార్యాలయం లోపల, బయట రాజకీయాలకు తావివ్వకూడదు. అయితే కేవలం  ప్రజా సేవకై విధులు నిర్వర్తించాల్సిన అధికార యంత్రాంగం నేడు వైసీపీ అడ్డగోలు నిర్ణయాలకు బలైపోతోంది. పార్టీ కార్యక్రమాల్లో అధికారులు పాల్గొనకూడదని నిబంధనను బ్రేక్ చేసి మరి.. కొంతమంది ప్రభుత్వ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా ఏపీ హేట్స్ జగన్ అంటూ నినదిస్తుంటే.. చివరి రోజుల్లో ఎవరి మాటలు విని ఇలా అధికారులు బలిపీఠం ఎక్కుతున్నారని ఆరోపణలు సోషల్ మీడియా వేదికగా మిన్నంటుతున్నాయి.

ఇప్పటికైనా ఐఏఎస్ స్థాయి అధికారులు కళ్ళు తెరచి గాడి తప్పుతున్న పాలనా వ్యవస్ధలను గాడిలో పెట్టాలని.., ప్రభుత్వ అధికారులు రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఆదేశాలు జారీ చేయాలని ప్రజా డిమాండ్లు పెద్దఎత్తున వినపిస్తున్నాయి.